ఏ సినిమా చూసిన నీతి సారం మాత్రం చెడుపై మంచి గెలవడమే.. ప్రతి సినిమా ముగింపు సమాజ హితం కోసమేనని ఇప్పటికే చాలా సినిమాలు చూపించాయి. అందుకే సినిమా స్టార్స్ కి అంతటి క్రేజ్ ఉంటుంది. వాళ్లే బయట చెప్పే మాటలకు కూడా అంత ప్రభావం ఉంటుంది. అయితే తాజాగా ఓ సినిమా సీన్ తో తొమ్మిదేళ్ల చిన్నారి తన నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టిన తీరు నటి జ్యోతిక మనసును గెలిచింది. నటి జ్యోతిక తొలిసారి లాయర్ పాత్రలో […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇటీవలే రోడ్డుప్రమాదానికి గురైన సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ఎక్కడా ఆగడంలేదు. తన మేనల్లుడు ఆసుపత్రిలో ఉండడంతో, అతడు నటించిన సినిమాను మరింతగా ప్రమోట్ చేయాలని […]
వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులనూ అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని గానగంధర్వ, పద్మవిభూషణ్ ఎస్. పి. బాలసుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ల్యాబ్ లో సినీప్రముఖుల సమక్షంలో జరిగింది. ‘మా’ అధ్యక్షులు వి.కె. నరేష్ డైరీని […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్ లో వుంది. ఇక, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శేఖర్ కమ్ముల, నాగ చైతన్య, సాయి పల్లవితో పాటు మరికొందరు అక్కినేని కుటుంబసభ్యులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాలేకపోయిన నాగార్జున, అమీర్‌ఖాన్‌తో […]
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం ‘తలైవి’.. లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత నటించింది. ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. కరుణానిధి పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు. శశికళగా పూర్ణ నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని రేపు (సెప్టెంబరు 26) […]
(సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి) గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం మనవాడు. తెలుగువాడు. బాలు పాటే మనకు తోడు. మనసు బాగోలేనప్పుడు ఆయన గానం మనకు ఓదార్పు. బాలు గాత్రంలో జాలువారిన హుషారయిన పాటలు వింటే చాలు జోష్ కలగాల్సిందే! అంతలా మనలను అలరించిన బాలు భారతీయుడు కావడం మహదానందం. ఇంకా చెప్పాలంటే బాలు పాట విన్నప్రతీవారూ పులకించిపోతారు. ఆ కోణంలో బాలు విశ్వమానవుడు కూడా! ఏ తీరున చూసినా బాలు అందరివాడు. అందరినీ […]
ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులకు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై, ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో ఇదే మా కథ చిత్రం తెరకెక్కింది. ఈ రోడ్ జర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. గురు పవన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తాజా చిత్రం ‘వాలిమై’ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవలే దీని ప్రమోషన్ యాక్టివిటీస్ ను మొదలు పెట్టారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే… సినిమాల్లోకి రాకముందు నుండే అజిత్ కు బైక్స్ అంటే ప్రాణం. అంతేకాదు అతను ప్రొఫెషనల్ రేసర్ కూడా! కొంతకాలంగా అజిత్ బైక్ పై వరల్డ్ టూర్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను నటించిన ‘రశ్మీ రాకెట్’ మూవీ అక్టోబర్ 15న జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవల మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అథ్లెట్ రశ్మీ పాత్ర కోసం తాప్సీ ప్రాణం పెట్టిందనేది ఈ ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. తెలుగులో మంచు లక్ష్మీని మొదలుకొని జాతీయ స్థాయిలో ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు తాప్సీ కృషిని అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే… ఎప్పటిలానే కొంతమంది నెటిజన్లు మాత్రం తాప్సీని […]
దర్శకుడు శివ నిర్వాణ తొలి చిత్రం ‘నిన్ను కోరి’. మలి చిత్రం ‘మజిలీ’. ఈ రెండు సినిమాలు డీసెంట్ హిట్స్ ను అందుకున్నాయి. అయితే… తాజాగా వచ్చిన ‘టక్ జగదీశ్’ మాత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇదే విషయాన్ని ఇవాళ ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు శివ నిర్వాణ సైతం అంగీకరించాడు. వైజాగ్ బీచ్ నుండి ఆయనో 40 సెకన్ల చిన్న వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన […]