మౌంట్ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తెలంగాణ యువకుడు ఆంగోత్ తుకారాం ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను తుకారాం కలిశాడు. ఈ సందర్భంగా తుకారామ్‌ను ముఖ్యమంత్రి జగన్ అభినందించారు. తుకారాం స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తక్కెల్లపల్లి.. . అతి పిన్న వయస్సులోనే 4 పర్వతాలు అధిరోహించటం అరుదైన సాహసంగా ఆంగోత్ తుకారాం పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే.