శుక్రవారం విడుదలైన తమిళ యంగ్ హీరో ధనుష్ తాజా చిత్రం ‘కర్ణన్’ బాక్సాఫీస్ బరిలో దూసుకుపోతోంది. తొలిరోజు 10.40 కోట్ల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 5.50 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. శుక్రవారం థియేటర్లలో నూరుశాతం ఆక్యుపెన్సీ ఉండగా, శనివారం నుండీ తమిళనాడు ప్రభుత్వం దీనిని 50 శాతంకు తగ్గించింది. దాంతో కలెక్షన్లు సగానికి సగం తగ్గాయి. అదే ఆదివారం కాస్తంత పుంజుకుని రూ. 6.50 కోట్లను కలెక్ట్ చేసింది. ఓవర్ ఆల్ గా వీకెండ్ లో ఈ మూవీ ఇండియాలో 26 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే… ధనుష్ తదుపరి చిత్రంలో నాయిక ఎవరు? అనే దానిపై ఇప్పుడు కోలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. బాలాజీ మోహన్ దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అతి త్వరలోనే ఇది సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇందులో హీరోయిన్ పాత్రకు తగినంత ప్రాధాన్యం ఉందట. పైగా ఇది నటనకు ఆస్కారం ఉన్న పాత్ర అట! దాంతో ‘నానీస్ గ్యాంగ్ లీడర్’తో పాటు ఇటీవల వచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. అయితే… టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఉప్పెన’ ఫేమ్ కృతీశెట్టి పేరునూ వారు పరిశీలిస్తున్నారట. నిజానికి ‘ఉప్పెన’కు ముందే కృతీశెట్టి తెలుగులో మూడు చిత్రాలకు కమిట్ అయిపోయింది. అందువల్ల తమిళ చిత్రానికి డేట్స్ కేటాయించగలదా? అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ ఇద్దరిలో క్రేజ్ ఎక్కువ ఉన్నది కృతీశెట్టికే కావడంతో ధనుష్ ఆమె వైపే మొగ్గు చూపొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కృతీశెట్టి… తెలుగులో నాని మూవీ ‘శ్యామ్ సింగరాయ్’లో నటిస్తోంది. సో… ధనుష్ ఎవరిని హీరోయిన్ గా ఎంపిక చేసినా… వాళ్ళు నాని కథానాయికే అవుతారు!