తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సినిమా అందరికీ సుపరిచితమే. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హందీ రీమేక్‌లో బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవగన్ నటించారు. హిందీలో అజయ్ దేవగన్ కూడా అదే తరహాలో పవర్ ఫుల్‌గా చేశారు. అయితే తాజాగా సింగం 3 సినిమాను కూడా హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో ప్రధాన పాత్రగా చేస్తోంది అజయ్ కాదంట. ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి అజయ్ తప్పుకోవడంతో సింగం3 రీమేక్‌లో అజయ్ నటించడం లేదు. ఇప్పుడు ఈ అవకాశం మరో యంగ్ యాక్టర్‌కు వచ్చింది. అతడెవరో కాదు.. తమిళ సింగం సినిమాలో విలన్ పాత్రలో అందరినీ మెప్పించిన అనూప్ సింగ్ ఠాకూర్. ఈ పాత్ర చేసే అవకాశం తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అనూప్ అన్నారు. ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి హీరోగా అనూప్ ఎంతవరకు మెప్పిస్తారో వేచి చూడాలి.