ఆర్ఆర్ఆర్‌ను మించిన భారీ బడ్జెట్‌తో ప్రభాస్ సినిమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా కనుమరుగవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక్కటి వస్తే గొప్ప. సరైన కథ కుదరకనో, హీరోల మధ్య విభేధాల కారణంగానో తెలియదు కానీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయింది. అయితే మన ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా తెరకెక్కించేందుకు ఇక్కడి హీరోలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్‌లో కూడా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అందులో భాగంగా ప్రభాస్‌తో బాలీవుడ్ అగ్రదర్శకుడు నెవర్ బిఫోర్ అనేలా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. బాలవుడ్‌లో చాలా కాలం తరువాత ‘వార్’ సినిమా ఓ మాదిరి మల్టీస్టారర్‌గా మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు వార్ దర్శకుడు హృతిక్‌తో మరో భారీ యాక్షన్ సినిమాను చేయాలని చూస్తున్నారంట. మళ్లీ ఈ సినిమాలోకి టైగర్‌ను తీసుకుంటారో లేదో తెలీదు కాని మరో స్టార్ హీరోను మాత్రం పక్కా అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హృతిక్‌తో తలపడేందుకు ప్రభాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని, వీరిద్దరి మధ్య భారీ ఫైట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ సినిమాను మించిన భారీ బడ్జెట్‌తో రూపొందించేందుకు సిద్దమవుతున్నారంట. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను దాదాపు రూ.450 కోట్లతో తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు యశ్ రాజ్ ఫిలింస్ వారు చేయనున్న మల్టీస్టారర్ సినిమాను దాదాపు రూ.500 కోట్లతో చేసేందకు రెడీ అంటున్నారంట. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
- Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
- Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!