గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ప్రభుత్వం ఒకవైపు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ మరో వైపు రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఎందరో ప్రముఖులు సైతం దీని బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రన్‌బీర్ కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ అని వార్తలు వస్తున్నాయి. అతడితో పాటు అతడి తల్లి నీతు కపూర్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం వీరిద్దరు హోం క్వారంటైన్‌లో ఉన్నారని టాక్ నడుస్తోంది. అయితే రన్‌బీర్ మేనమామ రన్‌ధీర్ కపూర్ మాత్రం రన్‌బీర్ కపూర్ అస్వస్తతగా ఉన్నారని, కానీ అది కరోనానా కాదా అనేది ఇంకా తెలియదని అన్నారు. ఇదిలా ఉంటే రన్‌బీర్ తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాలో పాల్గొన్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, అలియా భట్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పలు ప్రాజెక్టుల్లో రన్‌బీర్ పాల్గొంటున్నారు. రన్‌బీర్ కపూర్ షమ్‌షేరా సినిమాలో చేస్తున్నారు. అంతేకాకుండా లవ్ రంజన్ తెరకెక్కించనున్న తాజా సినిమాతో పాటు సందీప్ వంగ తదుపరి సినిమా యానిమల్‌లోను నటించనున్నారంట.