నేడు మరోసారి ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అధికారులు విచారించనున్నారు. నిన్న ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు, గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణ కోసం తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న వారిని లక్ష్యంగా […]
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాగల మరికొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి, ఆపై మరింత బలపడనుంది. కాగా ఈ నెల 18న ‘తౌక్టే’ తుఫాను తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర లపై దీని ప్రభావం వుండనుందని తెలిపింది. జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళకు రానున్న నేపథ్యంలో, వాటి ఆగమనానికి […]
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారుల బృందం హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్‌హిల్స్‌లో ఉన్న రఘురామకృష్ణరాజు నివాసానికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎంపీ రఘరామకృష్ణరాజును తరలించారు. ఆయన వస్తున్న సమయంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు, భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ […]
కరోనా పాజిటీవ్ లో హోమ్ క్వారంటైన్ లో ఉన్నాడు నందమూరి తారకరామారావు. ఈ రోజు ఎన్టీఆర్ ను ఫోన్ లో పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ‘కాసేపటి క్రితం తారక్ తో మాట్లాడాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తను తన ఫ్యామిలీ మొత్తం బాగుంది. తారక్ ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా ఉన్నారని తెలుసుకుని సంతోషిస్తున్నాను. త్వరలోనే కోలుకుంటారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. చిరంజీవి తమ హీరోని […]
‘ఇడియట్’, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘శివమణి’, ‘సూపర్’, ‘దేశముదురు’, చిరుత’, ‘గోలీమార్’, ‘పోకిరి’, ‘బిజినెస్ మ్యాన్’, ‘టెంపర్’, ‘హార్ట్ ఎటాక్’, ‘ఇస్మార్ట్ శంకర్’… పూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలలో ఓ కామన్ పాయింట్ ఉంది. అదే బీచ్ సాంగ్. ఆయన తనకు ఎంతో ఇష్టమైన బ్యాంకాక్, పటాయా, గోవా, మారిషస్ బీచ్ లలో తన సినిమాల్లో ఏదో ఒక సాంగ్ తప్పనిసరిగా ప్లాన్ చేస్తుంటారు. అసలు ఆయన సినిమా […]
మహేశ్ బాబు త్వరలోనే క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్నాడట. ఎఎంబి మాల్ పెట్టి థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైనట్లే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏమైనా మహేశ్ ఆరంభిస్తున్నాడేమో అనే సందేహం వస్తుందేమో! అలాంటిది ఏమీ లేదు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్ […]
టీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ క్రమంలో ఈటల తన సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో కార్యకర్తలు, నేతలతో చర్చించారు. ఇదిలావుంటే, తాజాగా ఈటల వరుసగా ఇతర పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఈటల భేటీ అయ్యారు. అంతకు ముందు […]
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా నటించిన ‘చెక్’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల కాబోతుంది. రంజాన్ సందర్బంగా మే 14 నుండి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో దేశద్రోహం కేసులో నితిన్ సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళతారు. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయనేది ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా […]
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయం వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తమిళనాడు కోయంబత్తూర్ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. కమల్ హాసన్ ఓట్ల లెక్కింపు ప్రారంభంలోనే ముందున్నప్పటికీ.. చివర్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ విజయం సాధించారు. కాగా కమల్ ఓటమి అనంతరం ఆయన కూతురు నటి శ్రుతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రి ఫొటోను షేర్ చేసింది. ‘మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది నాన్న’ అంటూ […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎవరినీ అంత తేలికగా పొగడదని అంటారు. అయితే అందులో వాస్తవం లేదు. తన భావాలను వ్యతిరేకించే వారిని విమర్శించడంలో ముందుండే కంగనా రనౌత్, కొందరిని మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా పొగుడుతూ ఉంటుంది. ఇటీవల అదే జరిగింది. దర్శకుడు మిలన్ లూధ్రియా ‘ది డర్టీ పిక్చర్’ను తొలుత కంగనా రనౌత్ తోనే తీయాలనుకున్నాడు. కానీ ఆమె అంగీకరించకపోవడంతో ఆ పాత్ర విద్యాబాలన్ కు లభించింది. ఆ సినిమాతో విద్యా బాలన్ […]