టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ రీసెంట్ గా నటించిన ‘చెక్’ చిత్రం కూడా ఓటీటీలో విడుదల కాబోతుంది. రంజాన్ సందర్బంగా మే 14 నుండి సన్‌నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్టు చిత్రయూనిట్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో దేశద్రోహం కేసులో నితిన్ సెంట్రల్ జైలుకి ఖైదీగా వెళతారు. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయనేది ఇంట్రెస్టింగ్‌గా మలిచాడు దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. నితిన్ సరసన ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌గా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. కళ్యాణి మాలిక్ సంగీతం సమకూర్చారు. ఫిబ్రవరి 26న థియేటర్ లోకి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాబట్టలేకపోయింది. మరి ఓటీటీలో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి!