మహేశ్ బాబు త్వరలోనే క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్నాడట. ఎఎంబి మాల్ పెట్టి థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైనట్లే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏమైనా మహేశ్ ఆరంభిస్తున్నాడేమో అనే సందేహం వస్తుందేమో! అలాంటిది ఏమీ లేదు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్ కు తీసుకు వెళ్లనున్నారని వినిపిస్తోంది. ఇందులో మహేశ్ ను అనిల్ రావిపూడి ఇప్పటివరకూ ఎవరూ చూపించనటువంటి పాత్రలో చూపించబోతున్నాడట. ‘సరిలేరు..’ లో మహేష్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన అనీల్ రాబోయే సినిమాలో క్రికెట్ కోచ్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఈ పాత్ర మహేష్ కి కూడా నచ్చిందట. పూర్తిగా అనిల్ రావిపూడి టైప్ లో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉంటుందట. ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ మహేష్ పోషించింది ఆర్మీ ఆఫీసర్ పాత్ర అయినప్పటకీ ఎలా వినోదాత్మకంగా తెరకెక్కిందో అలా ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగుతుందట. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేశ్, అనిల్ మరోసారి అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూద్దాం.