దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో లాక్‌డౌన్ విధిస్తూ ఆ రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. తాజాగా మరో వారం రోజుల పాటు ఢిల్లీలో లాక్‌డౌన్ ను పొడిగిస్తున్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేడు నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఈ నెల 24 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ అమల్లో ఉండనుంది. ఢిల్లీలో లాక్‌డౌన్ కు ముందు కేసుల తీవ్రత ఎక్కువగా ఉండగా.. లాక్ డౌన్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే […]
ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనిస్తుండడంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తౌక్టే తుఫాన్ తో కేరళ వణికిపోతుంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించింది కేరళ ప్రభుత్వం. తరుముకొస్తున్న ఈ తుఫాన్ ఆరు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడులో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. అంతేకాదు 12 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్లుగా తెలిపింది. […]
దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న వేళ ఎంతో మంది సినీ తారలు, క్రీడా ప్రముఖులు కరోనా టీకా తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్‌బీ ఇన్‌స్టా ద్వారా తెలిపారు. ‘రెండో డోస్ కూడా తీసుకున్నాను’ అని రాసుకొచ్చారు. ఇక ఆ మధ్య అమితాబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఇక అమితాబ్ బచ్చన్ […]
హైదరాబాద్ నగరంలో దొంగలు హల్ చల్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు ప్రయాణమయ్యారు నగరవాసులు. దీంతో చోరీలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. జియాగూడ వెంకటేశ్వర నగర్ కాలనీలోని 5 ఇళ్లలో చోరీ చేశారు. 20 లక్షల నగదు, 45 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పెళ్లి ఉండడంతో సిద్ధం చేసిన 45 తులాల బంగారం, 20 లక్షలకుపైగా నగదు […]
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారికి లక్షల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. తొలి వేవ్ సమయంలో అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, రష్యా తదితర దేశాల్లో భారీగా మరణాలు చోటుచేసుకున్నాయి. భారత్‌లోనూ మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఆరంభమయ్యాక ఇండియాలో వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనా ముందు ఏ స్థాయి వ్యక్తులైన తలవంచక తప్పట్లేదు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు కూడా […]
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీవాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోంది. అయితే, తాజాగా ఈ సినిమాలో పూజా హెగ్డే.. తన పాత్రను వెల్లడించింది. స్టాండప్ కమెడియన్‌గా కనిపించనున్నట్లు పేర్కొంది. రోజుల తరబడి చేసిన సాధనను ఒక […]
యాంకర్ అనసూయ అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై సత్తా చాటుతోంది. రీసెంట్ గా ఆమె ప్రధానపాత్రలో ‘థ్యాంక్యూ బ్రదర్’ నటించింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అశ్విన్ విరాజ్ కీలకపాత్రలో నటించారు. నూతన రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మే 7న ఆహా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను ‘ఆహా’ సంస్థ విడుదల చేసింది. లాక్‌డౌన్‌లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎలా చిత్రీకరించారనే […]
తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి విభిన్నమైన పాత్రలలో నటిస్తూ విలక్షణ నటుడుగా మెప్పిస్తున్నారు. ఇప్పుడు సేతుపతి స్టార్ డమ్ బాలీవుడ్ కు తాకింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న సినిమాలో, సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘అంధదూన్’ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మొదటి నుంచి ప్రచారంలో వున్న ‘మెర్రీ క్రిస్మస్’ టైటిల్ నే ఖరారు చేశారు.ఈ విషయాన్ని నిర్మాత రమేశ్ […]
గత కొద్ది రోజులుగా బీహార్ మరియు యూపీ రాష్ట్రాల్లో గంగా నదిలో పదుల సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. కనీసం అంత్యక్రియలు నిర్వహించకుండా శవాలను గంగా నదిలో వదిలేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై పరోక్ష విమర్శలు చేశారు. గంగానది తనను పిలుస్తోందని నాడు వ్యాఖ్యలు చేసిన వారే.. ఇప్పుడు ఆ నది విలపించేలా […]
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తమ్ముడు అషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు. బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. బెంగాల్ లో రేపటి నుంచి మే 30వరకు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించారు. అత్యవసర సేవలను అనుమతించడంతో పాటు, అవసరమైన వస్తువుల కొనుగోలుకు […]