కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా తమిళ నటుడు నితీశ్ వీరా కరోనాకు బలయ్యారు. ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అసురన్’లో పాండ్యన్ పాత్రపోషించి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ చెన్నైలోని ఒమందురార్ హాస్పిటల్ లో ఈ రోజు కన్నుమూశారు. ‘పుదుపేట్టై, వెన్నెల కబాడి కుళు, మావీరన్ కిట్టు’ సినిమాల్లో నూ గుర్తింపు ఉన్న పాత్రలను పోషించారు నితీశ్. ఇక రజనీకాంత్ ‘కాలా’లోనూ కనిపించిన నితీశ్ మరణం తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద షాక్ […]
తొలి చిత్రం ‘ఉప్పెన’తో భారీ హిట్ కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ హాకీ ప్లేయర్ అవతారం ఎత్తబోతున్నాడట. ఫస్ట్ సినిమాలో లవర్ బోయ్ గా ఆకట్టుకున్న వైష్ణవ్ క్రిష్ తో చేస్తున్న రెండో సినిమా ‘కొండపొలం’లో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రతి సినిమాలోనూ పాత్రల మధ్య వేరియేషన్ చూసించాలనుకుంటున్న వైష్ణవ్ అన్నపూర్ణస్టూడియో పతాకంపై నాగార్జున నిర్మించే సినిమాలో హాకీ క్రీడాకారునిగా కనిపిస్తాడట. ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాకు కొత్త దర్శకుడు పృధ్వీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇందులో […]
తమిళనాడులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతోన్న నేపథ్యంలో సీఎం సహాయ నిధికి సూపర్ స్టార్ రజనీకాంత్ రూ.50 లక్షల సాయం అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసి స్వయంగా అందజేశారు. కాగా తమిళ హీరోలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కరోనా సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు అందజేశారు. వీళ్లతో పాటు […]
ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రానున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనుండగా.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపికయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఏదో ఒక సమస్య షూటింగ్ కు అడ్డుపడుతూ వస్తుంది. అయితే ఈ కథ శ్రీరాముడుకు సంబంధించిన సబ్జెక్టు కావడంతో ఆ […]
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు అభియోగాలతో ఎంపీని సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలు సెలెక్షన్ల కింద ఆయన్ను అరెస్ట్ చేయడంతో రాజకీయ దుమారం రేగింది. తాజాగా ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. ఎంపీగా రఘురామకు ఉండే హక్కులను ప్రభుత్వం కాలరాసినట్లు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ పేరుతో ఎంపీ పట్ల అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వైద్యారోగ్య శాఖలపై సమీక్ష కోసం అధికారులే సీఎం ఫామ్‌హౌస్‌కు వెళ్లాలా అని నిలదీశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ లేక కోవిడ్ బాధితులు మరణిస్తే సర్కార్‌ది బాధ్యత కాదా అని ఉత్తమ్ ప్రశ్నించారు. కొవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామని గత ఏడాది సెప్టెంబరులో ముఖ్యమంత్రి చెప్పారని.. ఇంతవరకు ఆదిశగా చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 104, 108 […]
మంచిర్యాలలో రెమ్‌డెసివర్ ఇంజక్షన్స్ బ్లాక్ దందాపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కేంద్రంగా అంబులెన్స్ డ్రైవర్ల ద్వారా సాగుతున్న దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బాధితుల వీక్ నెస్‌ను క్యాష్ చేసుకుంటూ మంచిర్యాలలోని రెండు ప్రైవేట్ దవాఖానలకు చెందిన ఇద్దరు సిబ్బంది, ఇద్దరు అంబులెన్స్ యజమానులు ఒక గ్రూపుగా ఏర్పడి నెల రోజులుగా బ్లాక్ దందా నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కో […]
మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే జోరుగా ప్రచారం సాగింది. అయితే వీటిని కొట్టిపారేస్తూ […]
“ఆశయాల పందిరిలో…అనురాగం సందడిలో ఎదలు రెండు కలిశాయి… ఏటికెదురు నిలిచాయి” (యువతరం కదిలింది), “నేడే… మేడే’ (ఎర్రమల్లెలు), “మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం”, (నేటి భారతం) వంటి పలు సూపర్ హిట్ గీతాల అభ్యుదయ రచయిత అదృష్టదీపక్ (70) కొవిడ్ చికిత్స పొందుతూ కన్ను మూశారు. వీరికి భార్య, కుమారుడు ఉన్నారు. మాదాల రవి రూపొందించిన ‘నేను సైతం’ గీత రచయితగా అదృష్ట దీపక్ ఆఖరి చిత్రం. తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రపురం సమీపం… రాయవరం మండలం […]