ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమాపై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ కథ బాగా పెద్దది కావడంతో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారు. అయితే తాజాగా ఈ సినిమాపై సుకుమార్ శిష్యుడు, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు. పుష్ప మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీయఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు […]
ఏపీలోని అన్ని మున్సిపాలిటీల్లో త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ మేరకు పురపాలిక, నగరపాలికల కమిషనర్లతో మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్ కార్యక్రమం అమలుపై బొత్స సమీక్షించారు. మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ, తరలింపునకు 3100 కొత్త ఆటోల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెల 8 నుంచి 100 రోజులపాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నివాస, […]
దర్శకుడు కొరటాల శివ ‘మిర్చి’ లాంటి తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఆతర్వాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లాంటి వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా మారాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. అయితే రేపు కొరటాల శివ పుట్టినరోజు నేపథ్యంలో కొరటాల సినిమాలకు సంబంధించిన సర్‌ప్రైజ్ ఏమైనా ఉంటుందా అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆచార్య సినిమా […]
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న ఓంకార్ ‘జీనియస్’ సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆతర్వాత ‘రాజుగారి గది’ సినిమాతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాకు సీక్వెల్స్ ప్లాన్ చేసి సక్సెస్ అయ్యాడు. రెండో సీక్వెల్ గా తన తమ్ముడు అశ్విన్, హీరోయిన్ అవికా గోర్ ప్రధాన పాత్రల్లో ‘రాజు గారి గది 3’ సినిమా రూపొందించాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టు కోలేదు. అయితే చాలా రోజుల తరువాత ఈ సీక్వెల్స్ పై […]
కరోనా లాంటి మహమ్మారే లేకుంటే… సినిమా సెలబ్రిటీలు ఎక్కిన విమానం దిగిన విమానం అన్నట్టు తిరిగేసేవారు. కానీ, ఇప్పుడు వైరస్ ఎక్కడ లేని తంటాలు తెచ్చి పెట్టింది. ఓ వైపు వర్క్ లేకపోవటం, మరో వైపు ఇంట్లో కూర్చోలేక తల బద్ధలైపోవటం… డబుల్ ప్రెషర్!చాలా మంది గ్లామరస్ బ్యూటీస్ లాగే తాప్సీ కూడా తన లాక్ డౌన్ ప్రెషర్ అంతా వెకేషన్ ద్వారా తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఆమె తన చెల్లెలు షగుణ్ తో కలసి రష్యా […]
యూత్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ బాలీవుడ్ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డబూ రత్నాని క్యాలెండర్ లో చోటు సంపాదించాడు. బాలీవుడ్ స్టార్ హీరోల సరసన విజయ్ ఆ క్యాలెండర్ లో మెరిశాడు. దక్షిణాది నుంచి ఈ క్యాలెండర్ లో చోటు దక్కించుకున్న మొదటి హీరో విజయ్ దేవరకొండ కావడం విశేషం. కేవలం 9 సినిమాలతో విజయ్ నేషనల్ వైడ్ గా క్రేజ్ సంపాదించడం గమనించదగ్గ అంశం. ఇక క్యాలెండర్ కి సంబంధించిన స్టన్నింగ్ పోస్టర్ […]
దబ్బూ రత్నానీ… ఈయనెవరో తెలియని వారు చాలా మంది ఉంటారు. కానీ, ఈయన సంవత్సరానికి ఓ సారి జనంలోకి వదిలే సెలబ్రిటీ ఫోటోస్ తో కూడిన క్యాలెండర్… అందరికీ బాగానే తెలిసి ఉంటుంది. దబ్బూ రత్నానీ క్యాలెండర్ అంటే బీ-టౌన్ సెలబ్రిటీల్లోనూ క్రేజ్ ఉండటం విశేషం. ఆయన కెమెరా ముందు నిలబడి ఫోజులివ్వటం అంటే ప్రెస్టేజీగా ఫీలవుతారు ముంబై తారలు. అయితే, 2021 దబ్బూ రత్నానీ క్యాలెండర్ బాగా లేటైపోయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇన్ని […]
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 1511 కరోనా కేసులు నమోదు కాగా.. 12 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో 1.36 పాజిటివ్ రేటుగా వుంది. ప్రస్తుతం 16 శాతం బెడ్ ఆక్యుపెన్సీ ఉంది. ప్రతి రోజు 2 లక్షల మందికి వాక్సిన్ జరుగుతుందని తెలంగాణ వైద్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 80 లక్షల డోసులు వాక్సిన్ పూర్తి కాగా, 9 లక్షల 25 వేల స్టాక్ రాష్ట్రంలో ఉంది. […]
బాలీవుడ్ లో సూపర్ స్టార్ అన్న పేరు వినిపించగానే ఈ తరం వారికి షారుఖ్ నుంచీ రణబీర్ దాకా బోలెడు మంది హీరోలు గుర్తుకు వస్తారు. కానీ, నిన్నటి తరం వార్ని సూపర్ స్టార్ అని అడిగితే అమితాబ్ బచ్చన్ పేరు చెబుతారు. ఇంకా ముందు తరం వార్ని అడిగితే రాజేశ్ ఖన్నా అంటారు! నిజానికి ఆయనకు ‘ఒరిజినల్ సూపర్ స్టార్ ఆఫ్ బాలీవుడ్’ అనే టైటిల్ కూడా ఉంది!రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా ఓ […]
‘ద సూపర్ మ్యాన్’, ‘డెలివరెన్స్’ చిత్రాలతో హాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు నెడ్ బెట్టీ. ఆయన ఆదివారం ఉదయం మరణించారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన స్వంత ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ తుది శ్వాస విడిచారు. అతడి ఆరోగ్య సమస్యల గురించి ఇంకా సరైన సమాచారం లేదు. అయితే, నెడ్ బెట్టీ ఇక లేరనే విషయాన్ని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కన్ ఫర్మ్ చేశారు.దశాబ్దాల పాటూ, నెడ్ ఎన్నో చిత్రాల్లో సహాయ పాత్రలు […]