సినిమా షెడ్యూల్స్ ప్రీ పోన్ కు కారణం అదేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందా అని గట్టిగా అడిగితే లేదనే లెక్కలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణాలో ఇంకా రోజుకు వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మన దర్శక నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ మొదలు పెట్టేస్తున్నారు. ఈ విషయంలో నితిన్ ముందున్నాడు. ‘మాస్ట్రో’ బాలెన్స్ షూటింగ్ చకచకా పూర్తి చేసేశాడు. అలానే రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ సైతం చాలా కాలం తర్వాత మొదలైంది. యూనిట్ సభ్యులకు కరోనా సోకడంతో ఆగిన చాలా సినిమాల షూటింగ్స్ అనుకున్న తేదీ కంటే ముందే పట్టాలెక్కేస్తున్నాయి.
Also Read: కొత్త రంగంలోకి సురేశ్ ప్రొడక్షన్స్!
Also Read
‘ఆచార్య’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘థ్యాంక్యూ’ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప’, మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాల షూటింగ్ నిజానికి జూలై 5న మొదలవుతాయని వార్తలు వచ్చాయి. కానీ ఈ నెలాఖరుకే ఈ రెండు సినిమాల తాజా షెడ్యూల్స్ మొదలు పెట్టబోతున్నారట. ఇక ఇప్పటికే విశాల్ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ – వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, ప్రభాస్ ‘సలార్’ షూటింగ్స్ జూలై 1 నుండి తిరిగి మొదలవుతాయని తెలుస్తోంది. అలానే రవితేజ, నాగశౌర్య సైతం తమ చిత్రాల షూటింగ్ కు సమాయత్తమౌతున్నారు. ఓవర్ ఆల్ గా ఇప్పుడు దాదాపు అన్ని చిత్రాల బాలెన్స్ వర్క్ ను పూర్తి చేసే పనిలో యూనిట్ సభ్యులు ఉన్నారు. అయితే… ఇన్ని సినిమాలు ఒక్కసారే సెట్స్ పైకి వస్తుండటంతో క్యారెక్టర్ ఆర్టిస్టుల డేట్స్ ను సెట్ చేయడం అనేది సహాయ దర్శకులకు పెద్ద టాస్క్. ఇంత హడావుడిగా ఈ సినిమాల షూటింగ్స్ ప్రారంభించడానికి మరో ప్రధాన కారణం ఉందని తెలుస్తోంది. టైమ్ బాగోక కరోనా థర్డ్ వేవ్ వస్తే, అది ఎలా ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి… ఈ లోగా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయాలన్నదే అందరి లక్ష్యంగా కనిపిస్తోంది. మరి కరోనా థర్డ్ వేవ్ రాకముందే ఎన్ని సినిమాల షూటింగ్స్ పూర్తవుతాయో చూడాలి.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!