దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెరుగూతూ పోతున్నాయి. పెరిగిన పెట్రో ధరలు సామాన్యులకు చూపిస్తున్నాయి. దేశంలో దాదాపు 8 రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు రూ. 100 దాటింది. వాటిలో రాజస్ధాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లు ఉన్నాయి. తాజాగా పెట్రోల్ ధర లీటరుకు 28 పైసలు, డీజిల్‌పై 26 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఒడిసాలో సెంచరీ కొట్టింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.97.50, డీజిల్ రూ.88.23కు చేరుకుంది. వ్యాట్ ధరలలో వ్యత్యాసం, సరూకు రవాణా చార్జీలలో స్ధానిక పన్నుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం సంభవిస్తోంది.