ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘అల వైకుంఠపురములో’ హిందీలో ‘షహజాదా’గా రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక్కడ అల్లు అర్జున్, పూజా హెగ్డే పోషించిన పాత్రలను హిందీలో కార్తీక్ ఆర్యన్, కృతీ సనన్ పోషించబోతున్నారు. పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా సైతం కీలక పాత్రలకు ఎంపికైనట్టు తెలుస్తోంది. వరుసగా రెండు పెద్ద బ్యానర్స్ నుండి కార్తీక్ ఆర్యన్ ను తప్పించిన నేపథ్యంలో ‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్ ఆఫర్ రావడం అందరినీ […]
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై నటుడు నాగబాబు స్పందించాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కోసం ఇప్పటివరకూ సేకరించిన విరాళాలు ఏమయ్యాయో అంటూ బాలకృష్ణ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ‘మా’ శాశ్వత భవనం లేదంటూ బాలయ్య ఇటీవలే వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సేకరించిన విరాళాలు కేవలం సంక్షేమం కోసమేనని, భవనం నిర్మించడానికి సేకరించలేదని తెలిపారు. ‘మా’ ఎన్నికల్లో ఇప్పుడు అందరూ శాశ్వత భవనం గురించే మాట్లాడుతున్నారు.. ‘మా’కు శాశ్వత భవనం […]
కరోనా తెచ్చిన అనేక మార్పుల్లో ఆన్ లైన్ లర్నింగ్ కూడా ఒకటి. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉండిపోవటంతో స్మార్ట్ ఫోన్ ల ద్వారా స్మార్ట్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అవుతోంది. కానీ, దేశంలో ఇంకా చాలా మంది పేద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేవు. అందువల్ల వాళ్లు ఆన్ లైన్ శిక్షణకి దూరమవుతున్నారు. ఇకపై దూరవిద్యకి పేద విద్యార్థులు దూరం కావద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి తెర తీసింది. ఎవరి వద్దనైతే […]
బోలెడంత టాలెంట్ ఉండి కూడా హీరోలు, స్టార్స్ అవ్వలేకపోయిన వారికి ఇప్పుడు ఓటీటీలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో మనోజ్ బాజ్ పాయ్ డిజిటల్ ప్రపంచంలో ఓ బ్రాండ్ గా మారిపోయాడు. అదే బాటలో ప్రయాణిస్తున్నాడు అర్షద్ వార్సీ. బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై బిగ్ సక్సెస్ ఆయనకి పెద్దగా రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ, వెబ్ సిరీస్ ల శకం మొదలు కావటంతో ‘అసుర్’ […]
వీకెండ్ రాగానే సినిమాకి వెళ్లటం చాలా మందికి చాలా ముఖ్యమైన విషయం! కానీ, రెండేళ్లుగా కరోనా మహమ్మారి పుణ్యం కొద్దీ పెద్దతెర కాస్త పెద్ద గండంగా మారిపోయింది. మూతపడ్డ థియేటర్లు ఎంతకూ తెరుచుకోవటం లేదు. అయితే, బిగ్ స్క్రీన్ పై బిగ్ ఎంటర్టైన్మెంట్ మనమే కాదు… బిగ్ బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా మిస్ అవుతున్నారు! మనం థియేటర్ కు వెళ్లి చూసే హీరోలు, హీరోయిన్స్ కూడా థియేటర్స్ కు వెళ్లలేకపోతున్నామని బెంగపెట్టుకుంటున్నారు. అయితే, కంగనాకి మాత్రం ఎట్టకేలకు […]
‘6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, నేను సీతామాలక్ష్మి, శంకర్‌దాదా ఎంబీబీఎస్, నవ వసంతం’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోహిత్. ప్రస్తుతం ఆయన హీరోగా శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కళాకార్’. వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్న ఈ చిత్రంలో షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ వంటి ప్రముఖ నటులు కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ […]
నెట్ ఫ్లిక్స్ కోసం ఎస్. ఎస్. రాజమౌళి, ఆర్కా మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘బాహుబలి : బిఫోర్ ద బిగినింగ్’ వెబ్ సీరిస్ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. బాలీవుడ్ నటి, ‘తూఫాన్’ ఫేమ్ మృణాల్ ఠాకూర్… శివగామి పాత్రధారిణిగా ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. కానీ అవి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో వాటన్నింటినీ పక్కన పెట్టేశారట. మళ్ళీ కొత్తగా డేట్స్ ఇవ్వడానికి మృణాల్ ఠాకూర్ సిద్ధంగా లేకపోవడంతో శివగామి పాత్ర కోసం ఇప్పుడు […]
ప్రస్తుతం బుల్లితెరపై నడుస్తోన్న రియాల్టీ షోస్ లో ‘ఇండియన్ ఐడల్ 12’దే అగ్రస్థానం! వివాదాలు ఎన్ని రాజుకుంటున్నాయో అంతగా టీఆర్పీలు కూడా పోగవుతున్నాయి. ఎన్నో వారాలుగా కొనసాగుతోన్న మ్యూజిక్ కాంపిటీషన్ అంతకంతకూ ఆసక్తి పెంచుతోంది తప్ప తగ్గటం లేదు. అయితే, ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ఆగస్ట్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే అంటున్నారు. అయితే, ఎప్పటిలా కాకుండా ఈసారి రికార్డు సృష్టించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట! ‘ఇండియన్ ఐడల్ 12’ పన్నెండు గంటల […]
విక్టరీ వెంకటేశ్ వెండితెరపై వినోదాన్నే కాదు, పగ ప్రతీకారాలనూ అద్భుతంగా ఆవిష్కరించగలడు. దానికి తాజా ఉదాహరణ ‘నారప్ప’. తన కొడుకును హతమార్చిన ఓ వర్గంపై నారప్ప అనే రైతు ఎలా పగ తీర్చుకున్నాడన్నదే ఈ చిత్ర కథ. అందులో కులం కూడా ఓ ప్రముఖ పాత్ర పోషించింది. వెట్రిమారన్ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘అసురన్’కు ఇది రీమేక్. యంగ్ హీరో ధనుష్ పోషించిన పాత్రను వెంకటేశ్ రక్తి కట్టించగలడా అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేయకపోలేదు. దానికి […]
కరోనా మూడో వేవ్ సీరియస్ గా ఉండకపోవచ్చు అని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్)కి చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరింత వేగంగా వ్యాపించే వైరస్ రకం గనక వెలుగులోకి రాకపోతే అంత ప్రమాదమేమీ ఉండదని తెలిపారు. ఆగస్టు చివర్లో మూడో వేవ్ వస్తుందో, రాదో తెలిసిపోతుందన్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోవడం, భౌతికదూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడం అసలైన సవాళ్లు అని పేర్కొన్నాడు. ప్రస్తుత జాగ్రత్తల […]