మనలో చాలా మంది ఉదయాన్నే లేవాలనుకుంటాం! లేవగానే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం! చూడగానే ‘వావ్’ అనిపించేలా ఫిజిక్ సాధించాలనుకుంటాం! కానీ, యాజ్ యూజ్ వల్… ‘పడుకుంటాం’! ఇదంతా జాన్వీ విషయంలో మాత్రం రాంగ్…
జాన్వీ కపూర్ స్టార్ కిడ్. ఆమెకు బాలీవుడ్ లో ఎంట్రీ పెద్దగా కష్టపడకుండానే వచ్చింది. కానీ, ఇప్పుడిక ప్రూవ్ చేసుకునే టైం కూడా వచ్చేసింది. నటనతో పాటూ అందంతోనూ, ఆకర్షణతోనూ బీ-టౌన్ రేసులో తను దూసుకుపోవాలి. అంతే తప్ప తల్లి శ్రీదేవి పేరు, తండ్రి బోనీ కపూర్ పేరు చెబితే కుదరదు కదా! బాలీవుడ్ లో యాక్టింగ్ చేయకున్నా గ్లామర్ తో నెట్టుకురావచ్చు. కానీ, హాట్ లుక్స్ లేకుండా యంగ్ బ్యూటీ అస్సలు తట్టుకోలేదు. ఆ సీక్రెట్ తెలుసు కాబట్టే జాన్వీ జిమ్ లోని రకరకాల ఎక్విప్ మెంట్ తోనే రొమాన్స్ చేయటం మొదలు పెట్టేసింది…
Read Also: కాజల్, కియారా, సమంతని బీట్ చేసిన ‘భీష్మ’ బ్యూటీ!
జాన్వీ కపూర్ చిన్నప్పుడు చబ్బీగానే ఉండేది. గూగుల్ లో ఫోటోలు చూస్తే బేబీ జాన్వీ బబ్లీ రూపం మనకు కనిపిస్తుంది! కానీ, ఇప్పుడు జాను బీ-టౌన్ లో హాటెస్ట్ ఏంజిల్స్ లో ఒకరు! ఆమె రూపం, లావణ్యం వెనుక రహస్యం క్రమం తప్పని వర్కవుట్లే!
ముంబై పాపరాజీ కెమెరాలకీ జాన్వీ తన జిమ్ కాస్ట్యూమ్స్ లో కనిపించని రోజంటూ ఉండదు. ఆ ఫోటోలు, వీడియోలు నెట్ లో వైరల్ కాకుండా కూడా ఉండవు. పొట్టి నిక్కర్లు వేసుకుని జాన్వీ స్కిన్ షో చేస్తోందని విమర్శించే వారు ఎలాగూ ఉంటారు. కానీ, నిజంగా ఇన్ స్పైర్ అవ్వాలంటే మాత్రం తన నుంచీ చాలానే నేర్చుకోవచ్చు. జాన్వీ పిలేట్స్ మొదలు వెయిట్ లిఫ్టింగ్ దాకా అన్నీ చేసేస్తుంటుంది. ఆమె వర్కవుట్ సెషేన్స్ సెలబ్రిటీ ట్రైనర్ నమ్రతా పురోహిత్ రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది కూడా. తాను ఒక్కతే కాదు జాన్వీ అప్పుడప్పుడూ సారా అలీఖాన్ లాంటి ఇతర బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ తోనూ ఎక్స్ ర్సైజులు చేస్తుంటుంది! పర్ఫెక్ట్ ఫిజిక్ కోసం ఆమె డ్యాన్స్ క్లాసులకు కూడా అటెండ్ అవుతూ క్యాలరీలు కరిగిస్తుంది!
జాన్వీ కపూర్ తో సహా ఈ తరం బ్యూటిఫుల్ హీరోయిన్స్ అందరూ జిమ్ లో కృషి చేస్తూ జిగేల్ మని మెరిసిపోతున్నారు. తమ ఫిట్ నెస్ తో, కర్వీ ఫిగర్ తో ‘జిమ్’మంది నాదం అని కుర్రాళ్లు పాడుకునేలా దర్శనం ఇస్తున్నారు. మనమూ వారి నుంచీ ఖచ్చితంగా ప్రేరణ పొందాల్సిందే…
A post shared by Janhvi Kapoor ??? (@janhvikapoor_queen)