మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు నిరంతరం దాడి చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. మణిపూర్ అంశంపై ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
హిమాచల్ ప్రదేశ్ లో డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖూ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచింది. డీజిల్‌పై మొత్తం వ్యాట్ రికవరీ లీటరుకు రూ.10.40కి పెరిగింది.
విమానంలో ఓ ప్రయాణికుడు తన సహ ప్రయాణీకులను డబ్బును విరాళంగా ఇవ్వమని కోరిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో పాకిస్థానీ వ్యక్తి తనకు డబ్బు ఇవ్వాలని విమానంలోని ప్రయాణికులను అడుగుతున్నట్లు కనిపిస్తుంది.
బెంగాల్ లో జరిగిన పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో అక్కడ అనేక పాఠశాలలు ఘోరమైన నష్టాన్ని చవిచూశాయి. కొన్ని పాఠశాలల తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. మరికొన్ని తరగతి గదుల టేబుల్‌లు, కుర్చీలు విరిగిపోయాయి.
గతకొద్దీ రోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. అనారోగ్యానికి గురవుతుంటారు. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వైరల్ ఫీవర్, దగ్గు, జలుబు వంటి సమస్యలు తరుచుగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాలిలో తేమ కారణంగా ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు ఎక్కువగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. చంద్రయాన్-3కి సంబంధించి ప్రతి భారతీయుడు గర్వంతో పొంగిపోతున్నాడు. అయితే ప్రస్తుతం చంద్రయాన్‌కు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.
టీమిండియా వైస్ కెప్టెన్ రహానేతో మాట్లాడిన మాటలు అందరూ షాక్ కు గురయ్యేలా ఉన్నాయి. రహానే కంటే వారికన్ ఎక్కువ బంతులు ఆడాడని ఇషాన్ స్టంప్ మైక్‌లో చెప్పాడు. ఈ సమయంలో రహానే స్లిప్ వద్ద నిలబడి.. ఇషాన్‌ను ఏమి అన్నావని అడిగాడు. ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రహానే మూడు పరుగులు చేశాడు.
బ్యాంకాక్ లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్ లో జ్యోతి యర్రాజీ బంగారు పతకం సాధించింది. జూలై 13న జరిగిన ఈ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ.. తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిలో అధికంగా ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో ఈ వైరస్ మనుషులకు మరింత సులభంగా సోకుతుందని UN ఏజెన్సీలు హెచ్చరించాయి. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని నిబంధనలను పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సూచించింది. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు.
ఒక చిన్న బాతు పులిని తప్పించగలదని ఎవరైనా అనుకోగలరా?. కానీ అలాంటి దృశ్యమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కనిపిస్తోంది. ఈ క్లిప్‌ను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు.