ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సహరాన్‌పూర్ బైపాస్ హైవే రాంపూర్ మణిహారన్ సమీపంలోని ఛాలెంజ్ గేట్ సమీపంలోని వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు సజీవ దహనమయ్యారు.
రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఆపిల్ ఐఫోన్ 15 మరియు గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. మరోవైపు గూగుల్ ఈ ఏడాది మేలో పిక్సెల్ 7ఎ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా.. ఇది కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు గూగుల్ నుంచి మరో ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో పిక్సెల్ 8 ప్రోని ప్రారంభించవచ్చు.
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు మధ్యంతర బెయిల్ లభించింది. రూ.25,000 వ్యక్తిగత పూచీకత్తుపై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవల తానా 2025 - 2027 ప్రెసిడెంట్ గా ఎన్నికైన నరేన్ కు అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసిలో తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద ఆత్మీయ మిత్రుల మధ్య అభినందన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సతీష్ వేమన మాట్లాడుతూ.. విద్యావేత్త, సౌమ్యుడు అయిన నరేన్ తన కార్యదక్షతతో తానా ఖ్యాతిని మరో స్థాయికి చేర్చి ఇనుమడింపచేయగలడని హర్షం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు.
ఓ వ్యక్తి ప్రవహించే వరదలో కారు నడుపుతున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది కొండ ప్రాంతం.. అక్కడ చిన్న పొరపాటు జరిగినా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వీడియోలో వరదలో నుంచి ఎలా వెళ్తున్నాడో మీరు చూడవచ్చు. ప్రవహిస్తున్న నదిని లెక్కచేయకుండా వాహనాన్ని ముందుకు పోనిస్తున్నాడు. చిన్న పొరపాటు జరిగినా తన పరిస్థితి ఏమవుతుందో అని అస్సలు భయపడడు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్‌ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్‌ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్‌లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.
దేశం మొత్తం ఎవరి పునరాగమనం కోసం ఏడాది పాటు ఎదురుచూస్తుందో.. వారు స్టేడియంలో కనిపించనున్నారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ప్రపంచ కప్‌కు ముందు అతను నెట్స్‌లో బౌలింగ్ చేయడమనేది టీమిండియాకు మంచి సంకేతం. కొన్ని వార్త కథనాల ప్రకారం.. బుమ్రా నెట్స్‌లో 8 నుండి 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడు.
మహారాష్ట్రలోని పూణెలో వరుస వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అనూప్ వానీగా గుర్తించారు. లిఫ్ట్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను వేధించేవాడని పోలీసులు తెలిపారు. దాదాపు 18 మంది బాలికలను వేధించాడని వారు పేర్కొన్నారు.