ఢిల్లీలో వరదల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల గురించి ఆలోచించాలన్నారు. ఒక సీఎంగా ఉండి తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు.
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు.. 4 రోజుల్లో వరుసగా రెండోసారి ఓడిపోయింది. బంగ్లాదేశ్ సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియాను ఓడించింది. ఆదివారం జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో 40 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
ప్రపంచంలో ఒకచోట ఎడతెరిపి లేని వర్షాలు.. మరొక చోట అగ్ని వర్షం కురుస్తుంది. గ్లోబల్ వార్మింగ్ తో లక్షలాది మంది ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. యూరప్, జపాన్‌లో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. క్షిణ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా వర్ష బీభత్సంతో డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా 33 మంది మరణించారని, మరో 10 మంది గల్లంతయ్యారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ కసరత్తులు ప్రారంభించింది. అందుకోసం ఎన్‌డిఎ కుటుంబాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేస్తుంది. రాష్ట్రాలలోని చిన్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తే.. ఎన్డీయేకు ఎక్కువ సీట్లు వస్తాయి. దీంతో కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.
ముంబైలోని మలాడ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మార్వే క్రీక్ లో ఐదుగురు బాలురు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు బాలురులను స్థానికులు కాపాడారు. మిగితా ముగ్గురు గల్లంతయ్యారు. వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టింది.
అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. ఈ భూకంపం వల్ల అలస్కా ద్వీపకల్పంలో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
గల్ఫ్ దేశంలో త్వరలోనే ఐఐటి ఢిల్లీ ప్రవాస క్యాంపస్‌ను ప్రారంభించనుంది. అక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ మరియు అబుదాబి విద్యా మరియు నాలెడ్జ్ శాఖ (ADEK) ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటన సందర్భంగా అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు.
టొమాటోతో కొంతమందికి హాని కలిగిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు టమోటాలు హాని కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాంటి వారికి టొమాటో తినడం వలన కడుపు మంట వస్తుంది. అంతే కాకుండా.. టొమాటోలు తిన్న తర్వాత గుండెల్లో మంట, అజీర్ణం లేదా జీర్ణశయాంతర సమస్యలు ఉన్నవారు టమోటాలు తినకుండా ఉండటం మంచిది.
వైటాలిటీ బ్లాస్ట్ లో చివరి మ్యాచ్ హాంప్‌షైర్ మరియు ఎసెక్స్ మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఇందులో జో వెటర్లీ అత్యధికంగా 63 పరుగులు చేశాడు.