కర్నాటకలో ఓ బస్సు డ్రైవర్ పై బైకర్ దాడి చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. తన బైక్ ను బస్సు ఢీకొట్టిందని ఆ వ్యక్తి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు డ్రైవర్ పై ద్విచక్రదారుడు దాడికి పాల్పడ్డాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు బైకర్ ను అరెస్టు చేశారు. అయితే తన బైక్ ను బస్సు ఢీ కొట్టినందునే.. దాడికి పాల్పడ్డట్టు తెలిపాడు. అయితే బైకర్ బలవంతంగా బస్సులోకి ప్రవేశించి డ్రైవర్‌పై దాడి చేస్తున్న వీడియోను ఓ వ్యక్తి తన ఫోన్ లో వీడియో తీశాడు. దాడికి పాల్పడిన వ్యక్తి షారుఖ్ (30) గా గుర్తించారు. బస్సు డ్రైవర్ పై.. ఆ వ్యక్తి దుర్భాషలాడి బస్సు నుంచి బలవంతంగా బయటకు లాకే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు.
Veerendra Babu Arrest: రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
అయితే బస్సు బెంగళూరు వైపు వెళుతున్న క్రమంలో డ్రైవర్ పై దాడి చేశాడని.. నిందితుడు మైసూరు వాసిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆగస్టు 10వ తేదీ మధ్యాహ్నం 1:15 గంటల ప్రాంతంలో మైసూరులోని జిఎన్ రోడ్డులోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో చోటుచేసుకుంది.
Pawan Kalyan: విశాఖపై కేంద్ర ప్రభుత్వం నజర్ పెట్టింది..
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నిందితుడు షారుక్.. రన్నింగ్ బస్సులోకి బలవంతంగా ప్రవేశించడం. డ్రైవర్ పై దూర్బాషలాడుతూ.. బస్సు డ్రైవర్ ను బయటకు బలవంతంగా లాకే ప్రయత్నం చేశాడు. అలాగే.. డ్రైవర్ పై దాడి చేయడం కూడా చూడవచ్చు. ఈ క్రమంలో బస్సులో ఉన్నవారు అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.