ముంబైలోని నైగావ్ ప్రాంతంలో సినీ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న ఓ యువతి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తనను అన్ని రకాలుగా
ఉపయోగించుకున్నాడని.. పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ప్రియుడి చేతిలో ఆమె హత్యకు గురైంది. పెళ్లి చేసుకోవాలంటూ ఆ యువతి నిత్యం ఒత్తిడి తెచ్చేదని.. ఈ కారణంగానే మనోహర్ శుక్లా అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడు. మనోహర్ శుక్లా కూడా సినీ ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేస్తున్నాడు.
Read Also: IND vs SL: మళ్లీ వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన భారత్, శ్రీలంక మ్యాచ్
మనోహర్ శుక్లాకు ఇంతకుముందే వివాహమైనప్పటికీ భార్యను మోసం చేసి యువతి నయనతో కలిసి ఓ ఫ్లాట్‌లో ఉంటున్నాడు. తరుచూ భార్యతో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో నయన తనను పెళ్లి చేసుకోవాలని పదేపదే అంటుండటంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను చంపి.. మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి గుజరాత్‌లోని వాపి నగరం సమీపంలో ఉండే అడవిలో పడేశాడు. ఆ ప్రాంతం మహారాష్ట్ర-గుజరాత్ సరిహద్దులో ఉంది.
Read Also: Mama Garu: ‘స్టార్ మా’లో మొదలైన కొత్త సీరియల్ మామగారు!
మరోవైపు యువతి నయన అదృశ్యంపై తన సోదరి జయ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. అడవిలో సూట్ కేసులో మృతదేహాన్ని పడేసినట్లు గుర్తించారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యలో మనోహర్ భార్య పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆగస్టు 9వ తేదీన నయనను మనోహర్ హత్య చేశాడు. అదే రోజురాత్రి మహిళ మృతదేహాన్ని అడవిలో పడేశాడు. మృతురాలి సోదరి ఆగస్టు 14న నయన మిస్సింగ్ పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేసి సోమవారం రాత్రి మనోహర్‌ని అరెస్ట్ చేసి హత్యకు తెర తీశారు.