Jangaon BRS: జనగామ బీఆర్ఎస్ టికెట్పై ఉత్కంఠ వీడింది. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పల్లా, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య కుదిరినట్టు సమాచారం తెలుస్తోంది. మినిస్టర్ క్లబ్ హౌస్ లో కాసేపట్లో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో మంత్రి కేటీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు.. జనగామ టికెట్ ఆశావాహి మండల శ్రీరాములు, మరో ఆశావాహి కిరణ్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు.
Israel: గాజా చుట్టుపక్కల 1500 మంది హమాస్ ఉగ్రవాదులు హతం.. ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటన..
మొత్తానికి జనగామ టికెట్ పై బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలకు నేటితో తెరపడనున్నాయి. ఓ పక్క ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గం.. మరోపక్క పల్లావర్గం కొద్దిరోజులుగా జనగామ బీఆర్ఎస్ లో గ్రూపు రాజకీయాలు కొనసాగగా… ఇప్పుడు ఆ గ్రూపు రాజకీయాలకు తెర దింపే విధంగా దిశా నిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా.. జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లాను ప్రకటిస్తున్నామంటూ కేటీఆర్.. నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు తెలియజేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఈ భేటీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు కూడా బయటికి వచ్చాయి.