ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫిక్సింగ్ కలకలం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కుదిపేసింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించగా.. స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) చూస్తోంది. ప్రస్తుతం బీపీఎల్‌లో ఫిక్సింగ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న యాంటీ కరప్షన్ యూనిట్‌తో కలిసి పనిచేసే స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని బీసీబీ తెలిపింది. కాగా.. ఈ లీగ్‌లో ప్రపంచంలోని పలువురు స్టార్ ఆటగాళ్లు ఆడుతున్నారు.
Read Also: Cremation dispute: తండ్రి అంత్యక్రియలపై వివాదం.. మృతదేహం సగం కోసి ఇవ్వాలని కొడుకు డిమాండ్..
ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్:
ప్రస్తుత బీపీఎల్ సీజన్‌లో ఫిక్సింగ్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. బీసీబీ యొక్క యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) 8 మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకున్నట్లు వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. యాంటీ కరప్షన్ యూనిట్ 10 మంది ఆటగాళ్లను ప్రశ్నించింది. ఇందులో ఆరుగురు బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు అన్‌క్యాప్‌డ్ బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉన్నారు. ఫ్రాంచైజీలలో దర్బార్ రాజ్‌షాహి, ఢాకా క్యాపిటల్స్‌పై ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి. సిల్హెట్ స్ట్రైకర్స్, చిట్టగాంగ్ కింగ్స్‌పై కూడా కమిటీకి సందేహాలు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌ల్లో ఫిక్సింగ్ జరిగినట్లు అనుమానం
ఫార్చ్యూన్ బరిషాల్ vs రాజ్‌షాహి (జనవరి 6)
రంగపూర్ రైడర్స్ vs ఢాకా (7 జనవరి)
ఢాకా vs సిల్హెట్ (జనవరి 10)
రాజ్‌షాహి vs ఢాకా (జనవరి 12)
చిట్టగాంగ్ vs సిల్హెట్ (జనవరి 13)
బారిసల్ vs ఖుల్నా టైగర్స్ (జనవరి 22)
మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ కథనాలపై బీసీబీ ప్రెసిడెంట్ ఫరూక్ అహ్మద్ స్పందించారు. దోషులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బీపీఎల్ లీగ్ సమగ్రతను కాపాడటానికి బీసీబీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.