Sanju Samson: ఐపీఎల్‌కు ముందు రాజస్థాన్‌కు భారీ దెబ్బ.. శాంసన్‌కు గాయం
- సంజూ శాంసన్‌కు గాయం
- ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో సంజూ చూపుడు వేలికి గాయం
- జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో చూపుడు వేలుపై బలంగా తాకిన బంతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్‌కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో ఐదో టీ20లో సంజూ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సంజూ కీపింగ్ చేయలేదు. అతని స్థానంలో ద్రువ్ జురెల్ వికెట్‌కీపింగ్ చేశాడు. పలు నివేదికల ప్రకారం.. సంజూ రానున్న ఆరు వారాలు క్రికెట్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తుంది.
Read Also: Hezbollah: ఫిబ్రవరి 23న హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు..
Also Read
ప్రస్తుతం సంజు శాంసన్ తిరువనంతపురంలోని తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ పూర్తయిన తర్వాతే అతను తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ క్రమంలో.. ఫిబ్రవరి 8 నుంచి 12 వరకు పుణెలో జరిగే రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో కేరళ, జమ్మూ కాశ్మీర్‌తో ఆడనుంది. అయితే గాయం కారణంగా ఆ మ్యాచ్ లో ఆడటం కష్టమే.. కాగా, శాంసన్ తిరిగి ఐపీఎల్ 2025 సీజన్‌తో పునరాగమనం చేసే అవకాశాలున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Read Also: Maha Kumbh Mela: వసంత పంచమి ఎఫెక్ట్.. ఒక్కరోజే 2 కోట్ల మంది స్నానాలు
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ మరోసారి ఘోర విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో అతను కేవలం 51 పరుగులు (26,5,3,1,16) మాత్రమే చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులకు ఔటయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో శాంసన్ జట్టులో లేడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన జట్టులో కూడా శాంసన్ లేడు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!