భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి కార్లను కొనాలనుకునేవారికి ఆ కంపెనీ శుభవార్త చెప్పింది. తమ కంపెనీలోని ఇతర మోడల్ కార్లను కొనే వారికి భారీ ఆఫర్లను ప్రకటించింది. మారుతి సుజుకి, నెక్సా డీలర్‌షిప్ ద్వారా కొన్ని అత్యుత్తమ కార్లు, SUVలపై ఫిబ్రవరి 2025 కోసం భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. మీరు ఈ నెలలో మారుతి నెక్సా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఏ కారుపై ఎంత తగ్గింపు అందిస్తున్నారో తెలుసుకోండి……
Read Also: Accident : పెద్దఅంబర్ పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
మారుతి జిమ్నీ:
మారుతి జిమ్నీపై ఫిబ్రవరి నెలలో అత్యధిక డిస్కౌంట్ ఉంది. 2024 మోడళ్ల పై రూ.1.20 లక్షల నుండి రూ.1.90 లక్షల వరకు తగ్గింపు అందిస్తున్నారు. 2025 మోడళ్ల పై రూ.25,000 వరకు తగ్గింపును పొందవచ్చు. జిమ్నీ ఎక్స్-షోరూమ్ ధర రూ.12.75 లక్షల నుండి రూ.14.80 లక్షల వరకు ఉంటుంది.
మారుతి గ్రాండ్ విటారా:
మారుతి గ్రాండ్ విటారా కూడా ఫిబ్రవరి నెలలో మంచి డిస్కౌంట్‌ను అందిస్తోంది. 2024 మోడళ్ల పై రూ.1.65 లక్షల వరకు తగ్గింపు.. అలాగే 2025 మోడళ్ల పై రూ.1.10 లక్షల వరకు ఆఫర్‌లు అందిస్తున్నారు. గ్రాండ్ విటారా ధర రూ.11.19 లక్షల నుండి రూ.19.99 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి ఫ్రాంక్స్:
మారుతి ఫ్రాంక్స్ SUVపై ఫిబ్రవరి నెలలో రూ.1.03 లక్షల వరకు తగ్గింపు అందించబడుతోంది. 2024 మోడళ్ల పై ఈ ఆఫర్ ఉంటుంది. 2025 మోడళ్ల పై రూ.95,000 వరకు తగ్గింపు అందించే అవకాశం ఉంది.
మారుతి బాలెనో:
మారుతి బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌పై రూ.85,000 వరకు ఆఫర్‌లు ఉన్నాయి. 2024 మోడళ్ల పై ఈ ఆఫర్ ఉంటుంది. అలాగే 2025 మోడళ్ల పై రూ.55,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బాలెనో ధర రూ.6.70 లక్షల నుండి రూ.9.92 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి ఇన్విక్టో:
మారుతి ఇన్విక్టో (అత్యంత ఖరీదైన మోడల్)పై ₹3.15 లక్షల వరకు డిస్కౌంట్ అందించబడుతోంది. 2025 మోడళ్ల పై రూ.2.5 లక్షల వరకు తగ్గింపు అందిస్తారు.
మారుతి XL6:
మారుతి XL6 MPVపై ఫిబ్రవరి నెలలో రూ.75,000 వరకు తగ్గింపు అందించనున్నారు. 2025 మోడళ్ల పై రూ.45,000 వరకు డిస్కౌంట్ ఉంటుంది.
మారుతి సియాజ్:
మారుతి సియాజ్ మిడ్-సైజ్ సెడాన్ కారుపై ఈ నెలలో ర.85,000 వరకు డిస్కౌంట్ అందించనున్నారు. 2025 మోడళ్ల పై రూ.65,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఈ డిస్కౌంట్లు వివిధ షోరూమ్‌లు, వేరియంట్‌ల ఆధారంగా మారవచ్చు. మీరు ఏదైనా మోడల్‌ను కొనాలనుకుంటే సమీపంలోని మారుతి షోరూమ్‌ను సందర్శించి, అప్‌డేటెడ్ ఆఫర్లను తెలుసుకోవచ్చు.