VinFast VF 3: నానో కంటే మరో చిన్న కారు.. ఊపు ఊపేయడానికి వస్తున్న ఈవీ
- ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో విన్‌ఫాస్ట్ ప్రదర్శన
- విన్‌ఫాస్ట్ VF 6, విన్‌ఫాస్ట్ VF 7 ప్రవేశం
- 2025 పండుగ సీజన్లో భారతదేశంలో ప్రారంభం
- టాటా నానో కంటే చిన్న కారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు విన్‌ఫాస్ట్ (VinFast).. 2025 జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో అనేక వాహనాలను ప్రదర్శించింది. ఇందులో విన్‌ఫాస్ట్ VF 6, విన్‌ఫాస్ట్ VF 7లను కూడా ప్రవేశపెట్టింది. వీటిని 2025 పండుగ సీజన్లో భారతదేశంలో ప్రారంభించవచ్చు. అలాగే.. కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు విన్‌ఫాస్ట్ VF 3ను 2026లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ కారు టాటా నానో కంటే చిన్నగా కనిపిస్తుంది.. కానీ నలుగురు వ్యక్తులు ఇందులో హాయిగా ప్రయాణించవచ్చు. అయితే.. విన్‌ఫాస్ట్ VF 3 గ్లోబల్ స్పెక్ ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం…
Read Also: KTR : కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్.. కీలక అంశాలపై చర్చ
Also Read
- Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
ఎక్స్టీరియర్:
విన్‌ఫాస్ట్ VF 3 MG కామెట్ EV లాగా బాక్సీ డిజైన్‌లో ఉంటుంది. ఇరువైపులా రెండు డోర్లను కలిగి ఉంటుంది. ఇది బ్లాక్ క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, హాలోజన్ హెడ్లైట్లతో క్రోమ్ బార్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో ముందు పూర్తిగా నల్లగా, వెనుక బంపర్లతో.. బాడీ క్లాడింగ్ కూడా అందించనున్నారు. ముందు, వెనుక భాగంలో బ్లాక్-అవుట్ విభాగం ఉంటుంది. హాలోజన్ టెయిల్ లైట్లతో కూడి క్రోమ్ బార్ కూడా ఉంటుంది.
ఇంటీరియర్:
VF 3 క్యాబిన్లో 2-స్పోక్ స్టీరింగ్ వీల్.. 10 అంగుళాల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ డ్రైవర్‌కు డిస్ప్లే కూడా అవుతుంది. అలాగే.. గ్లోబల్-స్పెక్ మోడల్లో పూర్తిగా నల్లటి క్యాబిన్.. 4 సీట్లను అందిస్తుంది. వెనుక సీట్లను యాక్సెస్ చేయడానికి ముందు సీట్లు మడవవచ్చు. ఇందులో మాన్యువల్ AC, ఫ్రంట్ పవర్ విండోలు కూడా లభిస్తాయి. ప్రయాణికుల భద్రత కోసం.. బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (EBDతో), వెనుక పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.
బ్యాటరీ ప్యాక్ మరియు పరిధి
విన్‌ఫాస్ట్ VF 3 గ్లోబల్ స్పెక్ 18.64 kWh సింగిల్ బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుంది. ఈ కారు ఎలక్ట్రిక్ మోటారు 41 PS శక్తిని, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 215 కిమీ వరకు డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. బ్యాటరీని 36 నిమిషాల్లో 10%-70% ఛార్జ్ చేయవచ్చు.
అంచనా ధర
విన్‌ఫాస్ట్ VF 3 భారతదేశంలో ధరలు ఇంకా వెల్లడించలేదు. కానీ ఈ కారు ఫీచర్లు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటే.. ధర రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఉండవచ్చు.
భారత మార్కెట్లో ఈ కారు MG కామెట్, టాటా టియాగో EV, సిట్రోయెన్ eC3, టాటా టిగోర్ EV లతో పోటీ పడనుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
-
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!