ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.
Read Also: Shine Tom Chacko: దసరా విలన్ ఎంగేజ్ మెంట్.. అమ్మాయి ఎవరంటే.. ?
ఈరోజు (మంగళవారం) అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు క్యూ కట్టారు. రీజనల్ కోఆర్డినేటర్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, మంత్రి జోగి రమేష్ సీఎంఓకు వచ్చారు. అంతేకాకుండా.. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, చెన్నకేశవ రెడ్డి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఆరణి శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకట గౌడ్, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సీఎంవోకు వచ్చారు. కాగా.. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ల మార్పుకు ఛాన్స్ ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ క్రమంలో పార్టీ ప్రత్యామ్నాయం చూస్తుంది. ఈ క్రమంలోనే.. పాడేరు, అరకు ఎమ్మెల్యేలు సీఎంఓ కు వచ్చారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి ప్రకాశం, చిత్తూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల మార్పులపై కసరత్తు చేస్తున్నారు.
Read Also: Breaking News: వైసీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై..