Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుండెలాగిపోయే వార్త. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 షూటింగ్ ప్రాంగణంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో బాలయ్యకు స్వల్ప గాయమైనట్లు చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాకినాడ పరిసర ప్రాంతాల్లో వేగంగా శరవేగంగా జరుగుతోంది. అక్కడ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి చిన్నగా ‘మసిల్ టియర్’ అయింది. గాయం తీవ్రతను పరిశీలించిన వైద్యులు, ఆయన వేగంగా కోలుకోవడానికి ఒక చిన్న మైనర్ సర్జరీ అవసరమని సూచించినట్లు దర్శకుడు తెలిపారు.
ఈ ఘటనపై దర్శకుడు గోపీచంద్ మలినేని స్పందిస్తూ స్పష్టత ఇచ్చారు: “సినిమాపై ఆయనకున్న క్రమశిక్షణ, కష్టపడే తత్వం #NBK111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.” అన్నారు. గతంలో బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆకాశాన్నంటే అంచనాలు నెలకొన్నాయి . ఇటీవల విడుదలైన గ్లింప్స్‌కి సైతం మాస్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. బాలయ్య త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్ పైకి రావాలని నందమూరి అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
Also Read
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
తాజావార్తలు
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
ట్రెండింగ్
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..