Konda Surekha: గత పాలకుల విమర్శలు పట్టించుకోం.. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం
- హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై సీఎం దృష్టి పెట్టారు- కొండా సురేఖ
- గత పాలకుల విమర్శలు మేము పట్టించుకోం.. మా పని మేము చేసుకుంటూ పోతున్నాం- మంత్రి
- లక్షల కోట్లు మింగిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాకు అప్పుల కుప్ప పెట్టింది- కొండా సురేఖ
- ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను సకాలంలో ఇస్తున్నాం- మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ తరువాత వరంగల్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్‌లో మంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖా మాట్లాడుతూ.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. విపక్ష కార్పొరేటర్లకు కూడా నిధులు అందరితో సమానంగా కౌన్సిల్లో మాట్లాడడానికి సమయం కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. నగరంలో అక్రమాలకు గురైనా ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేశారని మంత్రి కొండా సురేఖా తెలిపారు. వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధి దిశగా తీర్మాణం చేశామన్నారు. మరోవైపు.. నయీంనగర్ నాల బ్రిడ్జితో ముంపు ప్రాంతవాసుల కష్టాలు తీర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మంత్రి చెప్పారు. అలాగే.. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తీర్మానం చేసుకున్నామని తెలిపారు.
Read Also: AP Excise Dept: కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు ఎక్సైజ్ శాఖ కసరత్తు
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
కాళోజీ కళా క్షేత్రంపై గత ప్రభుత్వం చిన్న చూపు చూసింది.. ముఖ్యమంత్రి రేవంత్ చొరవతో ప్రత్యేక ఫండ్స్ తీసుకొచ్చామని మంత్రి కొండా సురేఖా తెలిపారు. అంతేకాకుండా.. వర్షా కాలంలో ప్రబలుతున్న రోగాలపై ప్రత్యేక టీం ఏర్పాటు చేసాం.. విద్య, వైద్యం, అభివృద్ధి సంక్షేమాలపై రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ముందుకెళ్తున్నామని అన్నారు. గత పాలకుల విమర్శలు తాము పట్టించుకోమని.. తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని మంత్రి చెప్పారు. లక్షల కోట్లు మింగిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. తమకు అప్పుల కుప్పతో ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టిందని పేర్కొన్నారు. ఇదే కాకుండా.. ప్రతి నెలా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను సకాలంలో ఇస్తున్నాం.. ఎక్కడా తగ్గకుండా ప్రతిచోట సంక్షేమ పథకాలను జనాలకు అందిస్తున్నాం.. గత ప్రభుత్వంలో గుట్టలు గుట్టలుగా ఉన్న సీఎం హెల్త్ రిలీప్ ఫండ్ తమ ప్రభుత్వంలో క్లియర్ చేస్తున్నామని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకోవడం.. దాచుకోవడమే తప్ప ఏమీ చేయలేదని మంత్రి విమర్శించారు.
Read Also: DGP Jitender: తెలంగాణలో మావోయిస్టు ప్రాబల్యం లేదు- తెలంగాణ డీజీపీ..
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!