Suma Kanakala: ‘సూపర్ యాంకర్’ సుమ కనకాల!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెరపై ‘సూపర్’ అనిపించుకోలేదు కానీ, టాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాల వేడుకల్లో మాటలతో కోటలు కడుతూ ‘సూపర్’ అనిపించుకుంటూ ఉంటారు సుమ కనకాల. యాంకర్స్ లో సుమ ‘సూపర్ స్టార్’ అనే చెప్పాలి. దాదాపు రెండున్నర దశాబ్దాల నుండీ వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ సాగుతున్నారామె. సుమ నోట పరుగులు తీసే పదబంధాలు ప్రేక్షకులను పరవశింపచేస్తూ ఉంటాయి. తేనెలూరే తెలుగు ఆమె గళంలో గలగల గోదారిలా ప్రవహిస్తుంది. చిత్రమేమిటంటే- సుమ మాతృభాష తెలుగు కాదు. అయినా తెలుగు భాష ఆమె గాత్రంలో మరింత తీయగా వినిపిస్తూ ఉంటుంది. అందుకే సుమ వ్యాఖ్యానం విన్నాక ‘చిత్రం…భళారే విచిత్రం’ అనకుండా ఉండలేం.
సుమ 1974 మార్చి 22 కేరళలోని పాలక్కాడ్ లో జన్మించారు. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా సికిందరాబాద్ చేరుకున్నారు. సుమ పెరిగి, పెద్దయిందంతా సికిందరాబాద్ లోనే. తరువాత సుమ చిత్రసీమలో రాణించాలనుకున్నారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘కళ్యాణప్రాప్తిరస్తు’లో ఇద్దరు నాయికల్లో ఒకరిగా తెరకు పరిచయమయ్యారు. ఎందువల్లో సినిమాల్లో అంతగా రాణించలేకపోయారామె. అయితే వ్యాఖ్యాతగా తనదైన బాణీ పలికిస్తూ ప్రముఖ శాటిలైట్ ఛానెల్స్ లో పలు కార్యక్రమాలు చేస్తూ సక్సెస్ రూటులో సాగారు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా సుమ వ్యాఖ్యానం జనాన్ని అలరిస్తూనే ఉంది. ఇక సినిమాల వేడుకల్లోనూ సుమ యాంకరింగ్ కు ఎంతో క్రేజ్ ఉంది. సుమ వ్యాఖ్యానం చేసిన చిత్రోత్సవాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, సదరు చిత్రాలు ప్రేక్షకాదరణ పొందుతాయనే సెంటిమెంటూ ఉంది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
ఓ వైపు యాంకర్ గా తనదైన బాణీ పలికిస్తూనే తన దరికి చేరిన పాత్రలలో నటించారామె. అలా “పవిత్రప్రేమ, చాలాబాగుంది, వర్షం, స్వరాభిషేకం, ఢీ, బాద్ షా, ఓ బేబీ” వంటి చిత్రాల్లో నటించారు. గత సంవత్సరం సుమ ప్రధాన పాత్రలో ‘జయమ్మ పంచాయతీ’ అనే సినిమా రూపొందింది. సుమ భర్త రాజీవ్ కనకాల నటునిగా సాగుతున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి రోషన్ కార్తిక్ కనకాల, కూతురు స్నేహాశ్విని. సుమ కనకాల కొడుకు రోషన్ కార్తిక్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇటీవలే ఓ సినిమా మొదలయింది. ఏది ఏమైనా తెలుగునాట ‘సూపర్ యాంకర్’గా సాగుతున్న సుమ మరింతగా అలరిస్తూ సాగాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!