Leonardo Killers of the Flower Moon To Have 240 Mins Runtime: ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డి కాప్రియోపై ప్రతి రోజూ ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా లియోనార్డో శృంగారలీలల గురించి ఎక్కువగా హాలీవుడ్ లో చర్చ సాగుతూ ఉంటుంది. ఇతగాడికైతే 48 ఏళ్ళు. ఫర్లేదు ఆ మాత్రం చర్చ సాగుతుంది. ఇక ఈయన అభిమాన దర్శకుడు మార్టిన్ స్కార్సెసే వయసు 80 ఏళ్ళు. ఈ వయసులోనూ కుర్రకారును కిర్రెక్కించే చిత్రాలు తీస్తూ ఉంటారు మార్టిన్. అలాగని స్కార్సెసే చిత్రాలు నాసిరకమైనవి కావు. హై స్టాండర్డ్స్ లో ఉండే మూవీస్. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సిద్ధమైంది. ఈ చిత్రం అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే అంతకు ముందే మే 20న ‘కిల్లర్స్ ఆఫ్ ద ఫ్లవర్ మూన్’ సినిమా కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో వెలుగు చూడనుంది.
Salaar: సలార్ ఓవర్సీస్ హక్కులు.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
ఇంతకు ముందు లియోనార్డో డికాప్రియో హీరోగా మార్టిన్ స్కార్సెసే తెరకెక్కించిన “గ్యాంగ్స్ ఆఫ్ న్యూయార్క్, ది ఏవియేటర్, ద డిపార్టెడ్, ద వూల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్” వంటి చిత్రాలు ఎంతగానో అలరించాయి. 1986లో మార్టిన్ స్కార్సెసే తన ‘ఆఫ్టర్ అవర్స్’ చిత్రంతో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్ గా నిలిచారు. ఆ సినిమా తరువాత మళ్ళీ ఇన్నేళ్ళకు మార్టిన్ సినిమా కాన్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శితం కావడం విశేషం! అన్నీ బాగానే ఉన్నాయి. ఈ సినిమా ప్రదర్శన సమయం ఎంతో తెలుసా? అక్షరాలా 240 నిమిషాలు- అంటే నాలుగు గంటలు! మరి ఇందులో మార్టిన్ దర్శకత్వ ప్రతిభ ఏ తీరున ఉంటుందో? డికాప్రియో నటన ఎలా అలరిస్తుందో చూడాలి.
Mrunal Thakur : నేను అలా చేయడం అమ్మనాన్నకు అస్సలు ఇష్టం లేదు