Prabhas-Maruthi Movie: సినిమా రంగంలో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసిన దర్శకులు ఎంతో మంది ఉన్నారు. 'వాళ్ళతో సినిమానా!? ఇక హిట్ అయినట్టే!' అని పెదవి విరిచిన వాళ్ళే ముక్కున వేలేసుకున్న సంఘటనలూ చాలానే జరిగాయి.
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. ప్రముఖ హాస్యనటుడు కడాలి జయ సారధి ఇవాళ ఉదయం కన్నుమూశారు.. ఆయన వయస్సు 83 సంవత్సరాలు.. కిడ్నీ, లంగ్స్ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. నెల రోజులుగా హైదరాబాద్ సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున 2.32 గంటలకు మృతి చెందారు.
సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో మధుసూదన రాజు, ప్రతాప్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కొండవీడు’. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మతో పాటు ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్ రాజ్ ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ నెల 8న మూవీ జనం ముందుకు వస్తున్న సందర్భంగా యూనిట్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. తొలుత నిర్మాత మధుసూదనరాజు మాట్లాడుతూ, ‘మూవీ టీజర్, ట్రైలర్ ను విడుదలచేసిన హీరోలు శ్రీకాంత్, సునీల్ కు ధన్యవాదాలు తెలిపారు. సినిమా షూటింగ్ సకాలంలోనే […]
నవతరం హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని సాగుతున్నాడు సత్యదేవ్. తాజాగా ‘గాడ్సే’తో జనం ముందుకు వచ్చిన సత్యదేవ్ వైవిధ్యం కోసం తపిస్తూ ఉంటాడని ఇట్టే తెలిసిపోతుంది. సత్యదేవ్ కంచరణ 1989 జూలై 4న వైజాగ్‌లో జన్మించారు. విశాఖపట్నంలోనే ఇంటర్మీడియట్ దాకా చదువుకున్న సత్యదేవ్ విజయనగరంలోని ‘ఎమ్.వి.జి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్’లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశారు. 2016 దాకా ఐబీయమ్, వియమ్ వేర్ సంస్థల్లో పనిచేసిన సత్యదేవ్ తరువాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు. కొన్ని లఘు […]
హీరో రవితేజ పక్కన పెట్టేశాడంటూ ప్రచారంలో ఉన్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ఎట్టకేలకు ప్రమోషన్ మొదలైంది. శనివారం ఐటమ్ సాంగ్ సీసాను విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటకు శామ్ సి.ఎస్ సంగీతం అందిచారు. రవితేజ, అన్వేషా జైన్ పై చిత్రీకరించిన ఈ పాటను శ్రేయోఘోషల్ పాడారు. ‘ఒకరికి నే తేనె సీసా… ఒకరికి నేను కల్లు సీసా… ఒకరికి నే రసాల సీసా… అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా… ముట్టుకోకుండా ముద్దు పెట్టేస్తా… […]
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషల్లో జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఈ సినిమా ప్రోమోని గానీ, కనీసం ఫస్ట్ లుక్‌ని గానీ చిత్రబృందం విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దర్శకుడు ఓమ్ రౌత్ ఫ్యాన్ మేడ్ వీడియోతో షాకిచ్చాడు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకోండని చెప్పి, సైలెంట్ అయిపోయాడు. పోనీ, ఆ తర్వాతైనా ఏదైనా ఒక […]
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా రోజుల తరువాత ‘విక్రమ్’ సినిమాతో థియేటర్లోకి అడుగుపెడుతున్న విషయం విదితమే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండగా హీరో సూర్య ఒక స్పెషల్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రామిసింగ్ ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు […]