వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. కేబినెట్ నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సమావేశంలో కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. నవంబరు 30 తేదీనాటికల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల చేపట్టాల్సిందిగా మెమో జారీ చేశారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ సూచనలు […]
బ్రిటన్ ఆటోమోబైల్ దిగ్గజం ఎంజీ కంపెనీ ఆస్టర్ మోడల్‌ను అక్టోబర్ 11 వ తేదీన ఇండియాలో రిలీజ్ చేసింది. అక్టోబర్ 21 వ తేదీన ఎంజీ అస్టర్ మిడిల్ సైజ్ ఎస్‌యూవీకి సంబంధించి ప్రీబుకింగ్‌ను ప్రారంభించింది. ప్రీ బుకింగ్‌ను ప్రారంభించిన 20 నిమిషాల వ్యవధిలోనే 5 వేల కార్ల బుకింగ్ జరిగినట్టు ఎంజీ ఇండియా ప్రకటించింది. ఇప్పుడు బుక్ చేసుకున్న 5 వేల కార్లను వచ్చే ఏడాదివినియోగదారులకు అందజేస్తారు. కొత్త కార్ల బుకింగ్ కోసం వచ్చే ఏడాది […]
హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరుకుంది. బీజేపీ తరఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్‌కు మద్దతుగా హేమాహేమీలు ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలో ఈటెల నేను కలిసి పని చేశాం. ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ హుజురాబాద్ లో అడ్డా వేశారన్నారు. ఒక ఉద్యమ కారుడు ఈటల.. ఆలాంటి వ్యక్తిని ఎందుకు ఓడిస్తావు కేసీఆర్ అని ప్రశ్నించారు విజయశాంతి. […]
సాధారణంగా ఒక చెట్టుకు ఒకరకం పూలు, ఒకరకం పండ్లు మాత్రమే పండుతాయి. ఒకే చెట్టుకు అనేక రకాల పండ్లు పండుతాయా అంటే అసాధ్యమని చెప్పాలి. అయితే, జెనిటిక్ ఇంజనీరింగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రత్యేకమైన పద్దతుల్లో ఒకే చెట్టుకు అనేక రకాలైన పండ్లను పండించవచ్చని అంటున్నారు పెన్సిల్వేనియాలోని రీడింగ్ సిటీకి చెందిన సామ్‌వాక్ అకెన్. ఒక చెట్టుకు ఒకటి కంటే ఎక్కువ రకాలైన పండ్లను పండించడం వలన స్థలంతో పాటుగా సమయం కూడా ఆదా అవుతుందని, సీజన్‌తో […]
కర్నూలు జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో తరచూ ఇలాంటివి జరగడంతో భయాందోళనలు నెలకొన్నాయి. పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్ లో క్షుద్రపూజలు జరిగాయి. మట్టితో తయారు చేసిన బొమ్మలు, నిమ్మకాయలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్రపూజలు జరిగాయని తెలుస్తోంది. క్షుద్రపూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపరులు. అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. గొర్రెల కాపరులు ఫారెస్ట్ లో క్షుద్రపూజలపై భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి తాంత్రిక పూజల పై విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
సముద్రాల్లో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతున్నది. అరుదైన సముద్ర జంతువులు ఈ కాలుష్యానికి నశించిపోతున్నాయి. కాలుష్యంతో పాటుగా బీచుల్లో పడేసిన చెత్త సముద్ర జలాల్లోకి ప్రవేశించంతో జలచర జీవులు ఇబ్బందులు పడుతున్నాయి. బీచ్ అందాలకు చెత్త అవరోధంగా మారింది. ఎంత అవగాహన కలిగించినప్పటికీ మార్పు రాకపోవడంతో కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కువైట్ బీచుల్లో చెత్తను వేసిన వారిపై కఠిన చర్యలతు తీసుకునేందుకు సిద్ధమయింది. బీచుల్లో చెత్తను వేసినవారికి 10వేల కువైట్ దినార్లు జరిమానాగా విధిస్తామని ప్రభుత్వం […]
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు పోటీలో లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో వున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు వెలువడతాయి. 2019లో 77శాతం ఓటింగ్ నమోదైంది. ఈసారి ఓటింగ్ పెంచాలని, మెజారిటీ ఎక్కువ వచ్చేలా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ పొటీచేస్తున్న రెండు జాతీయ పార్టీల గురించే అంతా చర్చ సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అంపశయ్యమీదే వుంది. ఎక్కడా సరైన […]
దక్షిణ చైనా, ఇండో పసిఫిక్ ప్రాంతంలో సైనిక, రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా చూస్తున్నది. దీనికోసం చుట్టుపక్కల దేశాలను బెదిరిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే హాంకాంగ్, టిబెట్‌పై ఆధిపత్యం చలాయిస్తున్న చైనా, తైవాన్‌ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పటికే అమెరికా అధికారులు తెలిపారు. హిమాలయ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతూనే ఉందని చైనాలో కొత్తగా నియమితులైన సీనియర్ దౌత్యవేత్త నికోలస్ బర్న్స్ పేర్కొన్నారు. దక్షిణ చైనా సముద్రంలోని వియాత్నం, ఫిలిప్పిన్స్‌తో పాటుగా జపాన్, […]
ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతున్నది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవలం గంట వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. యూఏఈకి చెందిన అనీస్ సాజన్ అనే వ్యాపారవేత్త తన దనుబే కంపెనీలో పనిచేస్తున్న బ్లూకాలర్ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ కింద ఇండియా -పాక్ మ్యాచ్ టికెట్లను అందజేశారు. ఇండో […]
ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష.. దీనికి ప్రతిగా వైసీపీ ప్రజాగ్రహ దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగితే రాష్ట్ర బంద్ చేస్తారా అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో ట్వీట్లు చేశారు. జగన్ గారి హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దని, ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉనికిని […]