ఈనెల 24 వ తేదీన ఇండియా పాక్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతున్నది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు కేవలం గంట వ్యవధిలోనే అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురుచూస్తున్నది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనున్నది. యూఏఈకి చెందిన అనీస్ సాజన్ అనే వ్యాపారవేత్త తన దనుబే కంపెనీలో పనిచేస్తున్న బ్లూకాలర్ ఉద్యోగులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ కింద ఇండియా -పాక్ మ్యాచ్ టికెట్లను అందజేశారు. ఇండో పాక్ మ్యాచ్ ను ఉద్యోగులు ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఈ టికెట్లు ఇస్తున్నట్టు సాజన్ తెలియజేశారు. పాక్-ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వర్సెస్ ఏ2 క్వాలిఫైయర్ మ్యాచ్ టికెట్లను కూడా ఉద్యోగులకు ఇస్తున్నట్టు సాజన్ తెలిపారు.