హైదరాబాద్‌లోని నానక్ రాంగూడలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. 3 అంతస్థులలో సిలిండర్ పేలుడు ధాటికి గదులు కూలిపోయాయి. ఉదయం సిలిండర్ పేలుడు సంభవించింది. ఒకే సిలిండర్ కు మూడు కనెక్షన్స్ పెట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఒక కనెక్షన్ లీకేజ్ తోనే ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 50 మంది నివాసం వుంటున్నారు. భవనంలో ఎక్కువగా యూపీ బీహార్ కు […]
రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖ అన్నారు జగన్. ఈ సిటీలో రోడ్లు వున్నాయి. కరెంట్, అన్ని రకాల వసతులు వున్నాయి. సుందరీకరణపై శ్రద్ధ పెడితే విశాఖ హైదరాబాద్ తో పోటీపడుతుందన్నారు. మూడురాజధానుల విషయలో జగన్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్నదానికి అర్థం పర్థం లేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మండిపడ్డారు. సీఎం జగన్ నిర్ణయాలతో జనానికి తీరని లోటని తప్పుబట్టారు. వికేంద్రీకరణ […]
తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించిన సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామాపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నేడు హైకోర్టు లో సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామాపై విచారణ జరగనుంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు చేశారు. రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారించనుంది. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం […]
కులాలు, మతాలు అనే తేడా లేకుండా నివసిస్తోన్న హైదరాబాద్ నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. దళిత మహిళను కులాంతర వివాహం చేసుకున్నందుకు ఓ వ్యక్తి ఆ కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆలయ బహిష్కరణ చేశారు దేవాలయ నిర్వాహకులు. ఘటన హైదరాబాద్ శివారులోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం శ్రీ పద్మావతి సమేతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నక్క యాదగిరి గౌడ్ గత 14 ఏళ్లుగా పని చేస్తున్నాడు. అయితే, యాదగిరిగౌడ్ […]
హైదరాబాద్ లో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మసాజ్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఒక విటుడిని, పలువురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారా హిల్స్ రోడ్ నంబర్12 లో కొందరు ‘ఎలిగంట్ బ్యూటీ స్పాలూన్, అథర్వ హమామ్ స్పా’ పేర్లతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ కేంద్రాల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. […]
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ లో అరెస్ట్ లపై సీరియస్ అయింది జాతీయ బీసీ కమీషన్. ఈ మేరకు కరీంనగర్ సీపీకి నోటీసులు జారీ చేసింది జాతీయ బీసీ కమీషన్. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టారని నలుగురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు. దీనిపై నిరసన వ్యక్తం అయింది. ఈ ఘటనపై కమలాపూర్ కి చెందిన కారట్ల దశరథం జాతీయ బీసీ కమీషన్ కి ఫిర్యాదు చేశారు. వెంటనే […]
మేషం:- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రుణం పూర్తిగా చెల్లించి తాకట్టులు విడిపించుకుంటారు. స్త్రీల అతిథి మర్యాదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. అయిన వారే మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వృషభం:- పెద్దమొత్తంలో చెక్కుల జారీలో వ్యాపార వర్గాలకు పునరాలోచన అవసరం. స్వయంకృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. గృహంలో చిన్న చిన్న సమస్యలు, చికాకులు తలెత్తుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి […]
భక్తి టీవీ ఆధ్వర్యంలో ఈనెల 12 వ తేదీ నుంచి నవంబర్ 22 వ తేదీ వరకు కోటి దీపోత్సవం వేడుకలను నిర్వహించారు. కోటి దీపోత్సవంలో నేడు ఆఖరిరోజు కావడంతో ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కోటి దీపోత్సవంలో భాగంగా ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు మహాదేవుడిని దర్శించుకోవడానికి ఎన్టీఆర్ స్టేడియంకు వచ్చారు. Read: ఐపీఓకి […]
బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కొన్ని రోజులుగా దక్షిణాదిలోని ఆయా ప్రాంతాల్లో కురుస్తున్న కుండపోత వర్షాలకు ఉత్తర బెంగళూరు, ఉత్తర చెన్నై ప్రాంతాలను వరదలు ముంచె త్తాయి. కోసస్తలైయార్ నదికి వరద పోటెత్తడంతో ఉత్తర చెన్నైలోని మనాలి ప్రాంతంలోని పలు ఇళ్లలోకి నీరు చేరింది. పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు,కడప, నెల్లూరు పై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. బెంగళూరు, చైన్నై, ఏపీలలో ఇప్పటివరకు 24 మంది మరణించగా, పలువురు గల్లంతైనట్లు జాతీయ విపత్తునిర్వహణ అధికారులు తెలిపారు. […]