బల్గేరియాలో ఓ దారుణం చోటు చేసుకుంది. బల్గేరియా రాజధాని సోఫియా నుంచి 52 మంది పర్యాటకులతో బయలుదేరిన బస్సలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సుమొత్తం వ్యాపించడంతో ప్రయాణం చేస్తున్న 52 మందిలో 45 మంది సజీవదహనం అయ్యారు. అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో మృతుల సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. Read: 1000కి పైగా నీలి చిత్రాలు.. ఆ బూతు బంగ్లా ప్రత్యేకత ఏడుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇలాంటి ప్రమాదం […]
కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నివారణ చర్యలు ఎన్ని తీసుకున్నా దాని పని అది సైలైం ట్గా చేసుకుంటూ వెళ్తుంది. తాజాగా జైపూర్లోని ఓ పాఠశాలలో 11 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలడంతో ఆపాఠశా లను ప్రభుత్వం మూసివేసింది. కోవిడ్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పాఠశాలలను మూసివేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల విరామం తర్వాత, సెప్టెంబర్ నుం డి రాజస్థాన్లో పాఠశాలలు, కళాశాలలు, విద్యా […]
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ టారిఫ్ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. 20 నుంచి 25 శాతం రేట్లు పెంచింది ఎయిర్ టెల్. తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాకిచ్చింది వోడా ఫోన్ ఐడియా. ఎయిర్ టెల్ బాటలోనే ఆదాయంపై ఫోకస్ పెట్టాయి. ప్రైవేట్ టెలికాం రంగంలోని మిగతా కంపెనీలైన వొడాఫోన్ ఐడియా ఇండియా, రిలయన్స్ జియో కూడా త్వరలోనే ఛార్జీలు పెంచే అవకాశాలున్నాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్న […]
మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఆయన ఉసిరి మొక్కను నాటారు. ఈ సందర్భంగాచెట్ల యొక్క ఔన్నత్యాన్ని […]
బంగారం అక్రమ రవాణాకు దేన్నీ వదలడం లేదు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 18 లక్షల విలు చేసే బంగారం, ఐ ఫోన్ లతో పాటు పెర్ప్యూమ్ బాటిల్స్ ను సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని, ఐ ఫోన్లను, పెర్ప్యూమ్ బాటిల్స్ లగేజ్ బ్యాగ్ లో దాచి తరలించే ప్రయత్నం చేశారు. శంషాబాద్ […]
టమోటా.. పేరు చెబితే అంతా హడలిపోతున్నారు. ఒకప్పుడు రోడ్డుమీద పారబోసిన టమోటా ఇప్పుడు ఠారెత్తిస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డులో టమోటా ధరలకు రెక్కలు. గరిష్ఠంగా ధర కిలో రూ.130 పలకగా.. కనిష్టంగా ధర కిలో రూ.20పలికింది. ఉదయం కిలో టమోటా 104 రూపాయలకు అమ్మడయింది. టమోటా ధరలు చూసి అటువైపు వెళ్ళడానికే వినియోగదారులు జంకుతున్నారు. కూరల్లో టమోటాను నిషేధించారు. సాంబారు, టమోటా చట్నీకి రాం రాం చెప్పారు. టమోటా చట్నీ కావాలంటే అదనంగా చెల్లించాలని […]
భారీవర్షాలతో బురదమయంగా మారాయి తిరుపతిలోని రోడ్లు. ఎల్ బీ నగర్ వీధిలో బురదను తొలగించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీషా. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే భూమన. అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు పాగుతున్నారు. మరోవైపు వరద బాధితులకు తనవంతు సాయం అందిస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వరద ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు పంపిణీ చేసేందుకు నేవీ హెలికాప్టర్లో సరుకులను పంపిణీ చేస్తున్నారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.
కొండపల్లి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను జరిపి తీరాల్సిందేనని పట్టుపడుతోంది టీడీపీ. ఏదో విధంగా ప్రక్రియను ఆపేందుకు వైసీపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో కొండపల్లి పంచాయతీ రసకందాయంగా మారింది. కొండపల్లి మునిసిపల్ ఎన్నికల ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ సందర్భంగా జరిగిన పరిణామాలపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది టీడీపీ. గొడవ సృష్టిస్తోన్న వైసీపీపై చర్యలు తీసుకుని, సజావుగా మునిసిపల్ ఎన్నికలు జరిపించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. హైకోర్టులో ఈ పిటిషన్ […]
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకి రాసిన లేఖలో ముద్రగడ అనేక విషయాలు ప్రస్తావించారు. తన సతీమణికి అవమానం జరిగిందని చంద్రబాబు కన్నీళ్లు కార్చడం ఆశ్చర్యం కలిగించింది. నాడు మా కుటుంబానికి చేసిన అవమానానికి ఆత్మహత్య చేసుకోవాల్సింది. మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్య విరమించుకున్నాను. కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీ కోసం నాడు దీక్ష ప్రారంభిస్తే అవమానించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి […]
తిరుపతి నగరంలో భారీవర్షాల తర్వాత నిండుకుండలా మారిన రాయలచెరువు స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రాయల చెరువు సమీప గ్రామాల ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే వున్నారు. అక్కడ క్షణక్షణం ఉత్కంఠ. రాయల చెరువు ప్రాంతంలో జారుతున్న మట్టితో జనం ఊపిరి బిగపట్టి మరీ జీవితం వెళ్ళదీస్తున్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కంటిమీద కునుకు లేకుండా వుంది జిల్లా యంత్రాంగం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. రాయలచెరువు కట్టపైనే ఎమ్మెల్యే […]