అదృష్టం ఎప్పుడు ఎలా ఎవర్ని తలుపు తడుతుందో చెప్పలేం. అన్ని రోజులు పడిన కష్టం మొత్తం ఒక్కరాత్రితో పటాపంచలైపోతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. అందులో ఇదికూడా ఒకటి. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లా అంతే గుర్తుకు వచ్చేది వజ్రాల గనులు. హిరాపూర్ తపరియన్ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు వజ్రాల కోసం అక్కడ పనిచేస్తుంటారు. ఇందులో పనిచేసే శంశేర్ ఖాన్‌కు గనిలో ఓ వజ్రం దొరికింది.
Read: శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల: రికార్డు స్థాయిలో 13 నిమిషాల్లోనే…
6 క్యారెట్ల 66 సెంట్ల బరువైన ఆ వజ్రాన్ని ప్రభుత్వానికి అందించారు. ఈ గనిలో దొరికిన వజ్రాలను ప్రభుత్వం వేలం వేస్తుంది. అలా వేలంలో వచ్చిన డబ్బును ఆ వజ్రం దొరికిన కూలీకి అందజేస్తుంది. ఈ వజ్రం సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. దీంతో చాలా కాలంగా కూలీగా పనిచేస్తున్న శంశేర్ ఖాన్ రాత్రికి రాత్రే ఇలా లక్షాధికారి అయ్యాడు.