కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ కుదిపేస్తున్నది. వివిధ రూపాలుగా మార్పులు చెందుతూ మరింత బలంగా మారి విరుచుకుపడుతున్నది. తాజాగా దక్షిణాఫ్రికాలో బి 1.1.529 వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఇది ప్రమాదకరమైన వేరియంట్‌గా గుర్తించి దీనికి ఒమిక్రాన్ గా పేరు పెట్టారు. దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్నది. దక్షిణాఫ్రికాతో పాటుగా బోట్స్‌వానా, హాంకాంగ్ దేశాల్లో కనిపించింది.
Read: బెంగళూరులో మళ్లీ అదే భయం… ఆందోళనలో ప్రజలు…
తాజాగా ఈ రకం వేరియంట్ కేసులు ఇజ్రాయిల్, బెల్జియం దేశాల్లో కూడా బయటపడటంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. దక్షిణాఫ్రికా దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం విధిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో సహా ఆరుదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేదం విధించింది ఇజ్రాయిల్. సింగపూర్, జపాన్ తో పాటుగా యూరోపియన్ దేశాలు కూడా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఇండియాలో ఈ రకం వేరియంట్ కేసులు నమోదు కాలేదని ఇన్‌కాగ్ తెలియజేసింది.