పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కొందరు సెక్యూరిటీ గార్డుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. శ్రీశైలం దేవస్దానంలో కొంతమంది సెక్యూరిటీ గార్డులు తమ విధులు కాకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. శ్రీశైలం, సుండిపెంటకు చెందిన విద్యార్ధినీల మెయిల్ ఐడీలు హ్యాకింగ్ చేశారు. వారి ఫేస్ బుక్ లో అమ్మాయిల ఫోటోలు సేకరించి వారిని వేధిస్తున్నారు. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడుతూ డబ్బు ఆశ చూపిస్తూ విద్యార్థినీలకు వల వేస్తున్న ఆడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పర్సనల్ ఫోటోలను చూపించి అమ్మాయిలను వేధించడం […]
సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీల మృతి చెందడం హైదరాబాద్‌లో విషాదం నింపింది. కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో ఈ ఘటన జరిగింది. సెప్టిక్ ట్యాంక్ లో దిగారు నలుగురు కార్మికులు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ శ్రీను, ఆంజనేయులు అనే ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు. గౌతమి ఎన్‌క్లేవ్‌లోని అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు తొలుత ఇద్దరు కూలీలు దిగారు. కాసేపటికి వారికి ఊపిరాడక అందులోనే చనిపోయారు. విషవాయువులు వెలువడటంతో చనిపోగా ..ఇది గమనించి […]
హైదరాబాద్ నడిబొడ్డున యువత రెచ్చిపోయారు. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. రచ్చరంబోలా చేశారు. దీంతో సమాచారం అందుకున్న స్సెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని ఇంటిపై దాడులు చేసిన ఎస్వోటీ పోలీసులు షాకయ్యారు. రేవ్ పార్టీ పేరుతో యువత చిందులేశారు. ఈ సందర్భందా 44 మంది యువకులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. పెద్ద మొత్తంలో […]
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మరికొద్దిరోజుల్లో కొలిక్కి రానుంది. ఆశావహులు కేసీఆర్ ని ప్రసన్నం చేసుకుని పదవులు పొందేరు. చాలామటుకు ఎమ్మెల్సీ పీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మరికొన్నింటికి డిసెంబర్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పెద్దల సభకు వెళ్ళాలనుకునేవారి కల సాకారం అయింది. ఇందులో చాలామంది రెండుసార్లు ఎమ్మెల్సీ సీట్లు పొందారు. పదవులు రానివారు నామినేటెడ్ పదవుల వైపు మొగ్గుచూపుతున్నారు. 2014లో తెలంగాణ కల సాకారం అయ్యాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి రెండోసారి […]
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల […]
తమిళనాడులో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటేనే భయం భయంగా వుంది. బయటకు రాలేక, జీవనం గడవక నానా ఇబ్బందులు పడుతున్నారు జనం. భారీ వర్షాల కారణంగా చివరి మజిలీకి తిప్పలు తప్పడంలేదు. చెన్నై లో చనిపోయిన వ్యక్తిని ట్రాక్టరు ద్వారా తీసుకెళుతున్నారు కుటుంబ సభ్యులు. సౌత్ చెన్నైలో చోటు చేసుకున్న ఘటన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. భారీ వర్షాల కారణంగా అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అనారోగ్యంతో మరణించిన […]
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులులు, చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం ఖర్జీ అటవీ ప్రాంతంలో మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కాపరి మహేష్ చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం ఎఫ్‌బీఓలు మధుకర్, రమేష్, రాకేష్, గ్రామస్తులు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవి పందిని తింటుండగా మేకల మంద రావడంతో […]
సీఎం జగన్‌కి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బహిరంగ లేఖ. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న ప్రొత్సహాకాలను ఎందుకివ్వడం లేదని లేఖలో ప్రశ్నించారు సోము వీర్రాజు. పంచాయతీ నిధులకు పారదర్శకత ఏది..? ఏకగ్రీవ పంచాయతీ పాలక మండళ్ళకు ప్రోత్సాహక నగదు ఏది..? అంటూ తన లేఖలో ప్రశ్నలు సంధించారు సోము వీర్రాజు. జీవో విడుదల చేసి నవ మాసాలు నిండినా అమలు చేయరా..? అని అన్నారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే గతంలో వేలల్లో ఉండే ప్రోత్సాహకాన్ని లక్షల్లోకి […]
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, హెరాయిన్, బంగారం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. కృష్ణా జిల్లాలో మాదకద్రవ్యాలకు అడ్డాగా మారింది నందిగామలోని విజయ టాకీస్ సెంటర్. డ్రగ్స్ మత్తులో యువత జోగుతోంది. ఇటీవలి కాలంలో యువత డ్రగ్స్ మత్తులో చిత్తవుతున్నారు. అక్కడ యువత గంజాయికి బానిసగా మారుతున్నారని స్థానికులు చెబుతున్నారు. డ్రగ్స్ దొరక్కపోతే యువత ఆత్మహత్యలకు పాల్పడతామని వార్నింగ్ లు ఇస్తున్నారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేస్తున్నారు. తమ పిల్లలు డ్రగ్స్ కి బానిసలవుతున్నారని, బ్లేడ్‌తో కోసుకుంటున్నారు. […]
సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. యూపీలోని జెవార్‌లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి […]