బాబోయ్ పులి.. తెలుగు రాష్ట్రాల్లో భయం భయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో పులులు, చిరుత పులులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. కొమురం భీం జిల్లా దహెగాం మండలం ఖర్జీ అటవీ ప్రాంతంలో మేకలమందపై పులి దాడి చేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన కాపరి మహేష్ చెట్టుపైకి ఎక్కి గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.

అనంతరం ఎఫ్బీఓలు మధుకర్, రమేష్, రాకేష్, గ్రామస్తులు వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. పులి అడవి పందిని తింటుండగా మేకల మంద రావడంతో దాడికి యత్నించినట్లుగా గుర్తించారు. పులిదాడితో ఎటువంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ పులుల సంచారం జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం తిమ్మాపురం గ్రామంలో చిరుత పులి సంచారంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. చిరుత పులి గొర్రెల మందపై దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. పులిని బంధించి, తమను రక్షించాలని గ్రామస్తులు అటవీ అధికారులను కోరుతున్నారు.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!