అది నోయిడా కాదు.. చైనా డాగ్జింగ్ ఎయిర్ పోర్ట్.. బీజేపీపై కాంగ్రెస్ ట్వీట్ల వార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్ నడుస్తోంది. యూపీలోని జెవార్‌లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటూ కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, ప్రహ్లాద్ సింగ్ పాటిల్, అర్జున్ రామ్ మేఘవాల్, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు ఓ విమానాశ్రయ ఫోటోలు షేర్ చేశారు.
నిజానికి కేంద్ర మంత్రులు షేర్ చేసినవి మన దేశంలో ఎయిర్ పోర్ట్ ఫోటోలు కానేకాదని, అవి బీజింగ్‌లోని డాగ్జింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఫొటోలని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం

అది బీజేపీ కాదని, ‘బీజింగ్ జనతా పార్టీ’ అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో గ్రామాలు నిర్మించుకోవడానికి అక్కడి బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుంటే, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం చైనా విమానాశ్రయాన్ని తనదిగా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు లొంగిపోయిన ప్రభుత్వం లడఖ్‌లో మన భూభాగాన్ని ఆ దేశానికి అప్పగిస్తోందని ఆరోపించారు.
एशिया के सबसे बड़े एयरपोर्ट के रूप में नोएडा इंटरनेशनल एयरपोर्ट अपने साथ 35000 करोड़ रुपये का निवेश भी लाने जा रहा है। इससे एक लाख से अधिक लोगों को रोजगार उपलब्ध होगा और क्षेत्र में विकास की गति भी तेज होगी। pic.twitter.com/YokeYkz5Le
— Office of Mr. Anurag Thakur (@Anurag_Office) November 25, 2021
మరోవైపు, బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలపై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టెలివిజన్ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతలు సోషల్ మీడియాలో విడుదల చేసిన ఫొటోలు బీజింగ్‌లోని డాగ్జింగ్ అంతర్జాతీయ ఫొటోలని స్పష్టం చేసింది. ఈ ఎయిర్ పోర్ట్ రచ్చ అంతర్జాతీయంగా వైరల్ అవుతోంది. దీనిపై బీజేపీ నేతలు ఏమంటారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..