ప్రపంచంలో చాలా రాజ్యాలు, రాజులు ఉన్నారు. వారిలో కొందరు మాత్రమే చరిత్రను సృష్టించారు. అలాంటి వారిలో ఫ్రాన్స్ కు చెందిన నెపోలియన్ చక్రవర్తి ఒకరు. నెపోలియన్ 1799లో తిరుగుబాటు జరిగినపుడు వినియోగించిన ఖడ్గాన్ని వేలం వేశారు. చారిత్రాత్మక ఖడ్గం 2.8 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయిందని వేలం నిర్వాహకులు ప్రకటించారు. ఇల్లినాయిస్కు చెందిన రాక్ ఐలాండ్ సంస్థ ఖడ్గాన్ని వేలం వేసింది. ఖడ్గంతో పాటు ఐదు ఆభరణాలు కలిగిన తుపాకులను కూడా ఈ వేలం వేశారు. Read: […]
ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్ళారు వెంకయ్యనాయుడు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రోశయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్ గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. వారు నాకు […]
తమిళనాడు కూనురు దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. ప్రమాదంలో 11 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య ఆచూకీ కూడా తెలియడం లేదని సమాచారం. బిపిన్ రావత్, ఆయన భార్య క్షేమంగా వుండాలని, వీరు త్వరగా కోలుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన […]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా:కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నేషనల్ కోర్దినేషన్ కమిటీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ అధ్వర్యంలో కేటీపీపీ 11వందల మెగావాట్ల ప్రధాన ద్వారం ముందు అన్నీ అసోసియేషన్లు,ట్రేడ్ యూనియన్ల సిబ్బందితో నిరసన చేపట్టారు. విద్యుత్తు సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని జాతీయ విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల సమన్వయ కమిటీ (ఎన్సీసీఓఈఈఈ) పిలుపు నిచ్చింది. ఇందులో భాగంగా చెల్పూర్ కాకతీయ థర్మల్ విద్యుత్ […]
కరోనా కొత్త వేరియంట్ భయం ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నది. వివిధ దేశాల నుంచి ప్రయాణికులు భారత్‌కు వస్తున్నారు. అయితే, ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడానికి, రిపోర్టులు రావడానికి చాలా సమయం పడుతున్నది. దీంతో విమానాశ్రయాల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. రద్దీ పెరిగిపోవడంతో విమానాశ్రమాలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారే అవకాశం ఉంది. దీంతో రద్దీని తగ్గించేందుకు వేగంగా కరోనా ఫలితాలు వచ్చేందుకు అవసరమైన కిట్ల తయారీపై ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ దృష్టి సారించింది. Read: పూర్తిగా దగ్ధమైన […]
కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరినీ వదలడం లేదు. మాజీ సైనికుడు క్యాన్సర్ చికిత్స కోసం దాచుకున్న డబ్బులను సైబర్ నేరస్థులు కొట్టేశారు.చెక్ బుక్ కోసం టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసిన తీరును క్యాష్ చేసుకున్న సైబర్ నేరస్థులు చికిత్స కోసం మూడు బ్యాంక్ ల్లో దాచుకున్న 2 లక్షల 30 వేల రూపాయలను దోచేశారు. ఇక్కడ భార్యతో సహా కనిపిస్తున్న ఈయన పెద్దబోయిన భిక్షపతి. మాజీ సైనికుడు దేశ సేవకోసం బార్డర్లో సేవలందించారు. విజయవంతంగా సేవలు […]
అధికారం చేతిలో వుంటే అవినీతి ఇంటికి నడుచుకుంటూ వచ్చేస్తుందంటారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ అవినీతి సమ్రాట్‌లుగా ఎదిగిపోతున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు భారీగా ఆస్తులు కూడబెట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు వున్నాయన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. ఉదయం నుంచి సబ్ రిజిస్ట్రార్ జేవీవీ ప్రసాదరావు ఇంటిపై, కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో భారీగానే ఆస్తులు, నగదు లభించినట్టు తెలుస్తోంది. […]
చెరువులు, నదుల్లో చేపల వేట కొందరికి సరదా. మరికొందరికి జీవనోపాధి, చేపల కోసం వలవేస్తే కొందరికి తాబేళ్ళు, పాములు, కప్పలు గట్రా పడుతుంటాయి. ఒడిశాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలలో పడ్డ దాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. వలలో ఏకంగా ఒక మొసలి చిక్కడమే అందుకు కారణం. ఇవాళ నా పంట పండిందనుకుని వల పైకి లాగితే సర్రున మొసలి రావడంతో ఆ మత్స్యకారుడు అవాక్కయ్యాడు. వెంటనే అటవీ […]
ఈమధ్యకాలంలో ఇళ్ళల్లోకే కాదు మనం పార్క్ చేసిన వాహనాల్లోకి పాములు దూరుతున్నాయి. నానా ఇబ్బందులు పెడుతున్నాయి. పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలో ఓ పాము దూరింది. ఆ పామును బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మెకానిక్ ని పిలుసుకొని రావాల్సిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే ఓ ఉపాధ్యాయురాలు తన స్కూటీని స్కూల్ అవరణలో పార్కింగ్ చేశారు. స్కూటీలో పాము ఎలా […]
తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికలు. రెండు స్థానాలకు పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 72 గంటల ముందు సైలెంట్ పీరియడ్. ఈనెల 10వ తేదీన 8 గంటల నుండి 4 వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. రెండు స్థానాలకు 8 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. కరీంనగర్ 2,జగిత్యాల 2 , పెద్దపల్లి 2, హుస్నాబాద్ 1, సిరిసిల్లలో ఒక పోలింగ్ కేంద్రం వుంది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం ఓటర్లు 1324. పురుషులు 581 […]