NTV WebDesk
Author- NTV Telugu-
రికార్డ్ స్థాయిలో చికెన్ అమ్మకాలు… మూడు రోజుల్లో…
సంక్రాంతికి నగరం నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్లారు. నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గిపోయింది. అయితే, సగం నగరం ఖాళీ అయినప్పటికీ సంక్రాంతి వేడుకలు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండగకు రికార్డ్ స్థాయిలో చికెన్ సేల్స్ జరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 60 లక్షల కిలోల చికెన్ సేల్స్ జరగింది. సాధారణంగా గ్రేటర్ పరిధిలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్ […] -
15 ఏళ్ళ నాటి నిర్లక్ష్యం.. కానరాని పరిష్కారం
పదిహేనేళ్ల క్రితం కృష్ణానదిలో మంచాలకట్ట వద్ద నాటుపడవ మునగడంతో 61 మంది జలసమాధి అయ్యారు. నదిపై వంతెన నిర్మిస్తామని అప్పట్లో ప్రభుత్వం హడావుడి చేసినా పనులు మాత్రం శిలాఫలకాలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రమాదం మిగిల్చిన విషాదానికి తోడు పాలకులు నిర్లక్ష్యం స్థానికులను వెక్కిరిస్తోంది. పదిహేనేళ్ల క్రితం జరిగిన విషాదం ఇంకా ఆ ప్రాంతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రస్తుత నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా జరిగిన పడవ విషాదం ఇప్పటికీ ఆ […] -
తెలంగాణలో పరిపాలనా సంస్కరణల కమిటీ
తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, […] -
యువకుడిపై యువతి దాడి.. ఎందుకంటే?
ఈమధ్యకాలంలో ప్రేమించిన యువకుడి చేతిలో మోసపోతున్న యువతులు, మహిళలే ఎక్కువ. కానీ హైదరాబాద్‌లో ప్రేమించిన యువకుడిపైనే దాడికి దిగింది ఓ యువతి. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రేమించి మోసం చేశాడని… యువకుడిని కత్తితో పొడిచిందా యువతి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు లంగర్ హౌస్ పోలీసులు. 15 నెలలుగా ఓ యువతి కృష్ణ అనే వ్యక్తితో ప్రేమలో పడింది యువతి. 6 నెలలుగా యువతిని దూరం పెట్టాడు […] -
మోడీని గద్దెదించడమే మా లక్ష్యం-సీపీఐ రామకృష్ణ
రాష్ట్ర విభజన తర్వాత కమ్యూనిస్టుల పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు చెప్పిందే రామకృష్ణ చేస్తున్నారనే విమర్శలపై ఆయన స్పందించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో అనేక అంశాలపై రామకృష్ణ తనదైన రీతిలో సమాధానాలిచ్చారు. దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల పాత్ర తగ్గుతోంది. పార్లమెంటులో 5 సీట్లే వున్నాయి. ప్రజలకు ఇప్పుడున్న సమస్యలు వేరు. సమస్యల పరిష్కారం కోసం కొత్త పద్ధతులు కావాలి. ప్రజలకోసం పోరాటం చేయాలి. వర్గ పార్టీ కాబట్టి కష్టజీవులు, కార్మికులు, కర్షకుల కోసం మేం పోరాడుతున్నాం. మార్పులు […] -
పిల్లలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…బీ అలర్ట్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా, ఒమిక్రాన్ పిల్లలపై పెను ప్రభావమే చూపిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుండడంతో.. అమెరికా, యూరప్‌ల్లో అధికశాతం చిన్నారులు.. ఆస్పత్రుల్లో చేరుతున్నారు.అయితే కరోనా నిబంధనలు పాటించడం, వ్యాక్సినేషన్ ద్వారా వీటికి కళ్లెం వేయవచ్చంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. అనేక దేశాల్లో కొవిడ్ మూడో దశ మొదలైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ వేరియంట్ పిల్లలపైనా అధికంగానే ప్రభావం చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొదటి రెండు దశల సమయంలో పిల్లలపై అంతగా ప్రభావం చూపని […] -
టుడే కోవిడ్ అప్ డేట్
1 దేశంలో కరోనా కేసుల్లో కాస్త పెరుగుదల నమోదవుతూనే వుంది. తాజాగా భారత్‌లో 2 లక్షల 71 వేల కేసులు నమోదయ్యాయి. 16.65 లక్షలమందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా కారణంగా 314 మంది మరణించారు. పాజిటివిటీ రేటు స్వల్పంగా తగ్గింది. 16.28 శాతంగా నమోదైంది. గత వారం పాజిటివిటీ రేటు 13.69 శాతంగా వుండేది. భారత్ లో 7,743కు చేరింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య. ఏపీలో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. కొత్తగా 4,570 కోవిడ్ కేసులు […] -
అకాల వర్షం…అన్నదాతకు అపారనష్టం
తెలుగు రాష్ట్రాలను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు… మరికొన్ని ప్రాంతాల్లో గాలివానలు భయపెడుతున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటికే పంటలు బాగా దెబ్బతిన్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దట్టంగా మంచు కురిసే వేళలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ వానలు పడుతున్నాయి. అకాలంలో పడుతున్న ఈ వర్షాలు… రైతులకు అపార నష్టాన్ని మిగిలుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర […] -
ఒకవైపు కరోనా..మరోవైపు జాతరల సీజన్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జాతరల సీజన్ మొదలైంది. ఇంటి ఇలవేల్పులకు మొక్క చెల్లించేందుకు పెద్దఎత్తున భక్తులు జాతరలకు వెళ్తుంటారు. కరోనా పెరుగుతున్న సమయంలో జరుగుతున్న ఈ జాతరల్లో ముందు జాగ్రత్తల పరిస్థితి ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. జనవరి మాసం వచ్చిందంటే చాలు వరంగల్ జిల్లాలో జాతర సీజన్ మొదలవుతుంది. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా కొత్తకొండ, కొమురవెల్లి, మేడారం జాతరలు జరుగుతాయి. సంక్రాంతి నుంచి మొదలయ్యే జాతరలతో ఉమ్మడి […] -
31 నుంచి పార్లమెంట్ .. కోవిడ్ విజృంభణతో అలర్ట్
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను షిఫ్ట్‌లవారీగా నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించే విధంగా సీట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ అధికారి మాట్లాడుతూ, కోవిడ్ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలను సురక్షితంగా […]
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!