NTV WebDesk
Author- NTV Telugu-
ఏపీలో కరోనా విజృంభణ.. కొత్తగా 6,996 కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ఏపీలో నైట్ కర్ఫ్యూ విధించినప్పటికీ వైరస్ తీవ్రత ఏ మాత్రం తగ్గటం లేదు. ఇక తాజాగా ఏపీలో మరో సారి కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,17, 384 కి పెరిగింది. […] -
దిద్దుబాటు లేదా సర్దుకోండి!
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై పార్టీ పెద్దలకు నివేదికలు అందాయా? ఆ రిపోర్ట్‌ల ఆధారంగా కొందరు శాసనసభ్యులను పిలిచి మాట్లాడారా? హితబోధ చేశారా.. లేక క్లాస్ తీసుకున్నారా? దిద్దుబాటు చేసుకోలేని ఎమ్మెల్యేలు సర్దుకోవాల్సిందేనా? గులాబీ శిబిరంలో ఉత్కంఠ రేపుతున్న నివేదికలేంటి? ఎమ్మెల్యేల పనితీరుపై ఫీడ్ బ్యాక్ తెప్పించుకున్న టీఆర్ఎస్తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది పార్టీ. దీంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారి పనితీరు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? […] -
పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి
పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సీఎంవోతో అధికారులు చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏను తగ్గించడంపై ఉద్యోగులు ఆందోళన చేపట్టనున్నారు. పీఆర్సీ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ఫిట్మెంట్, హెచ్ఆర్ఏలను భారీగా తగ్గించడంపై సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి. పీఆర్సీ జీవోలన్ని ఉద్యోగులకు నష్టం కలిగించేలా ఉన్నాయని బండి వెంకట్రామిరెడ్డి అన్నారు. Read Also: తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం […] -
టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
1.యూపీలో రాజకీయ వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ. మళ్ళీ అధికారమే పరమావధిగా అడుగులు వేస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేయనున్నారా..? ఇంతకూ యోగీని అయోధ్యనుంచే పోటీకి దించాలని బీజేపీ నేతలు ఎందుకు భావిస్తున్నారు…? యోగీ, అయోధ్య స్థానానికి మారడం.. సార్వత్రిక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపనుంది.?అనేది యావత్ భారతాన చర్చనీయాంశంగా మారింది. 2.ఏపీలో ఉద్యోగసంఘాలు ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు […] -
ఎవరి మీద పోరాటం చేస్తున్నారు.. బీజేపీకి హరీష్ రావు కౌంటర్
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య హోరాహోరీ మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా బీజేపీ నేతల్ని చెడుగుడు ఆడేస్తుంటారు. కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు. 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టే అన్నారు మంత్రి హరీష్ రావు. జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయి. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చింది. ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే […] -
తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చిన సంక్రాంతి.. రూ.107 కోట్ల ఆదాయం
సంక్రాంతి పండుగ తెలంగాణ ఆర్టీసీకి కలిసొచ్చింది. పండుగ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి సేవలు అందించడమే కాకుండా… వారం రోజుల వ్యవధిలోనే భారీ ఆదాయాన్ని ఆర్జించింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. ఎలాంటి అదనపు ఛార్జీలు ప్రయాణికుల వద్ద నుంచి వసూలు చేయకుండానే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఈ ఘనత సాధించింది. సంక్రాంతి సందర్భంగా టీఎస్ ఆర్టీసీ అదనంగా 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది.షెడ్యూల్ బస్సులతో పాటు అదనంగా 4 వేల బస్సులను సంస్థ […] -
హోలీకి వస్తానంటున్న ‘బచ్చన్ పాండే’!
రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా […] -
ఎన్కౌంటర్లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలింపు
ములుగు కర్రిగుట్ట ఎన్కౌంటర్లో గాయపడ్డ జవాన్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న జవాన్ మధు. అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. గ్రేహౌండ్స్ జవాన్ మధును కలిసేందుకు భారీ స్థాయిలో యశోద ఆస్పత్రికి చేరుకుంటున్న పోలీసు అధికారులు.ఇంటలిజెన్స్, గ్రేహౌండ్స్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకున్నారు. వీరితో పాటు ఐజీ ప్రభాకర్ రావు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ అనిల్ కుమార్ జవాన్‌ణ మధు ఆరోగ్య […] -
మద్యం అమ్మకాల టైం పెంచడంపై ఏపీ బీజేపీ పంచ్
ఏపీలో మద్యం అమ్మకాల సమయం పెంచడంపై విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. సమయాన్ని పెంపుదల చేయడంపై బీజేపీ ఆక్షేపిస్తోంది.కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగు సంస్కృతిని దెబ్బ తీసేందుకే వైసిపి కంకణం కట్టుకుంది.గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారమే తెలుగు సంస్క్రుతిని దెబ్బ తీసే చర్యల్లో భాగమే అన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. క్యాసినోల నిర్వహణ అనేది వైసిపి ప్రభుత్వ పరోక్ష నిర్ణయంలా ఉందనడానికి ప్రత్యేక రుజువులు […] -
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ..ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు
ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టూరులో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏర్పాటు చేశారు. సంతమాగులూరు మండలం వెల్లలచెరువలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. సింగరాయకొండలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పాల్గొన్నారు. Read Also:నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో.. కరోనా బారినపడ్డ […]
తాజావార్తలు
-
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్‌గా అనిల్ రావిపూడి!
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్‌కు నో చెప్పిన ధర్మాసనం.!
-
Abhishek vs Samson: అభిషేక్‌కు ఓ రూల్.. సంజుకు మరో రూలా.. బీసీసీఐపై తెలుగు ప్లేయర్ ఫైర్!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!