ఏపీలో మద్యం అమ్మకాల సమయం పెంచడంపై విపక్షాలు వ్యంగ్యాస్త్రాలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. సమయాన్ని పెంపుదల చేయడంపై బీజేపీ ఆక్షేపిస్తోంది.కేసినో వ్యవహారంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తెలుగు సంస్కృతిని దెబ్బ తీసేందుకే వైసిపి కంకణం కట్టుకుంది.గుడివాడలోని కె .కన్వెంక్షన్ హాలులో కేసినో వ్యవహారమే తెలుగు సంస్క్రుతిని దెబ్బ తీసే చర్యల్లో భాగమే అన్నారు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
క్యాసినోల నిర్వహణ అనేది వైసిపి ప్రభుత్వ పరోక్ష నిర్ణయంలా ఉందనడానికి ప్రత్యేక రుజువులు అవసరం లేదు.ఈ కేసినో ద్వారా వందల కోట్లు చేతులు మారినా ప్రభుత్వం చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోంది.చేతులకు తాళ్ళు కట్టుకునే మంత్రి ప్రతి విషయానికి స్పందిస్తారు ఈ విషయంలో ఎందుకు మిన్నకుండిపోయారు. సంక్రాంతి పండుగ సాంప్రదాయానికి వక్ర భాష్యం చెప్పేలా వైసిపి నాయకత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు సోము వీర్రాజు.
మద్యంపై ప్రభుత్వం రూట్ మార్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఆడపడుచులకు ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా మద్యం అమ్మకాలను ఇంకో గంటపాటు పెంచారు. మద్యం అమ్మకాల గడువును పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలి. రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులను తెరచి ఉంచాలి. లేదంటే బీజేపీ దీనిపై ప్రజా ఉద్యమం చేస్తుందని సోము వీర్రాజు హెచ్చరించారు.
వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులను తెరచి ఉంచాలి. లేదంటే @BJP4Andhra దీనిపై ప్రజా ఉద్యమం చేస్తుంది. (2/2)@ysjagan @JPNadda @VMBJP @PurandeswariBJP @Sunil_Deodhar @klnbjp @satyakumar_y @GVLNRAO @CMRamesh_MP @yschowdary @TGVenkateshMP
— SOMU VEERRAJU / సోము వీర్రాజు (@somuveerraju) January 18, 2022