NTV WebDesk
Author- NTV Telugu-
టుడే ఎన్టీవీ టాప్ న్యూస్
1.2019-20కి సంబంధించి దేశంలోని ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు, అప్పుల వివరాలను అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆస్తులలో టీఆర్ఎస్ పార్టీ, అప్పులలో టీడీపీ టాప్‌లో ఉన్నాయి. జాతీయ పార్టీల విషయానికి వస్తే… బీజేపీకి అత్యధికంగా రూ.4,847.78 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని వెల్లడైంది. బీజేపీ తర్వాతి స్థానంలో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఉంది. ఆ పార్టీకి రూ.698.33 కోట్లు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. జాతీయ పార్టీల […] -
మేడారంలో భక్తుల కిట కిట
మేడారంలో భక్తుల సందడి నెలకొంది. ముందస్తు మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినవారికి వసతి సదుపాయం కల్పించారు. కరోనా వల్ల భక్తులు ముందుగానే వస్తున్నారు. జాతర రాకముందే బెల్లం బంగారంగా అమ్మవార్లకు సమర్పిస్తున్నారు. దర్శనం బాగా అయిందని భక్తులు చెబుతున్నారు. -
LIVE: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రెస్ మీట్
-
కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి జీతాలు.. సజ్జల
ఏపీలో పీఆర్సీ వివాదం పీటముడి వీడడం లేదు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనల పై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు చెల్లిస్తాం అన్నారాయన. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలకు, ఉద్యోగ సంఘ నాయకులు పెట్టిన మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. ముఖ్యమైన హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని ఉద్యోగ సంఘాలు ప్రస్తావించటం లేదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వేసే అంశాన్ని […] -
ఉద్యోగులంటే కేసీఆర్ కు లెక్కలేదు.. ఈటల ఫైర్
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారు ముఖ్యమంత్రి. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఈ నర్సంపేట వాసి ఉప్పుల […] -
ఉద్యోగ సంఘాలతో సర్కార్ నాలుగు స్థంభాలాట
ఉద్యోగ సంఘాలతో ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు స్థంభాలాట ఆడిందని మండిపడ్డారు పీఆర్సీ సాధన సమితి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఇది చాలదన్నట్టు ఉద్యోగుల్లో చీలిక తెచ్చేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతలు కూడా లేఖ ఇచ్చి చర్చలు జరిపారు. చర్చలకు వెళ్లిన మా ప్రతినిధులను ప్రభుత్వం కించపరిచేలా వ్యవహరించడం సరికాదు.ప్రభుత్వం తరపున ఎవరు వస్తారోననేది వారిష్టం.. అలాగే మా తరపున ఎవర్ని చర్చలకు పంపాలనేది మా ఇష్టం.మేం ఇచ్చిన లేఖకు సమాధానం […] -
ఆర్టీసీ కార్మిక సంఘాల కీలక నిర్ణయం.. సమ్మెకు సై
పీఆర్సీ విషయంలో ఏపీ ఉద్యోగ సంఘాలు పట్టుదలగా వున్నాయి. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని ఉద్యోగ, కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా పీఆర్సీ సాధన సమితి పిలుపుమేరకు సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిర్ణయించడంతో కీలకంగా మారింది. ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నిర్ణయం ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. పీఆర్సీ సాధన సమితికి పూర్తి […] -
దేశంలో పెరిగిపోతన్న సెకండ్ హ్యాండ్ మొబైల్ వ్యాపారం… ఒక్క ఏడాదిలో…
దేశంలో కరోనా మహమ్మారి తరువాత సెకండ్ హ్యాండ్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. సెకండ్ హ్యాండ్ కార్లకు ఏ విధంగా డిమాండ్ ఏర్పడిందో సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నది. ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్ అసోసియేషన్ లెక్కల ప్రకారం 2021లో 2.50 కోట్ల సెకండ్ హ్యాండ్ మొబైళ్లు ఇండియా మార్కెట్లో అమ్ముడయ్యాయి. దీని విలువ 2.3 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. 2019 నుంచి 21 వరకు సెకండ్ హ్యాండ్ మొబైళ్ల వ్యాపారంలో […] -
చిన్నారుల పరేడ్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా…
జనవరి 26 వచ్చింది అంటే దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలు జరుగుతుంటాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశంలోని ప్రజలంతా ఘనంగా జరుపుకుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సమయంలో పిల్లల హడావుడి అంతాఇంతా కాదు. ఇక బిజినెస్ రంగంలో నిత్యం బిజీగా ఉండే ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చిన్నారుల గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌ను పోస్ట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్‌ను తలపిస్తూ కొంతమంది చిన్నారులు శబ్దం చేస్తుంటే, మధ్యలో […] -
ఫిలిప్పిన్స్‌కు బ్రహ్మోస్ క్షిపణులు…డీల్ విలువ ఎంతంటే…
ఇప్పటి వరకు ఇండియా రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నది. ప్రపంచంలో దిగుమతుల్లో ఇండియా మూడో స్థానంలో ఉన్నది. అయితే, ఆత్మనిర్భర్‌లో భాగంగా ఇప్పుడు దేశంలో తయారైన ఆయుధాలను ఎగుమతి చేసేందుకు సిద్ధం అవుతున్నది. దేశంలో తయారైన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పిన్స్‌కు ఎగుమతి చేసేందుకు ఒప్పదం కుదిరింది. ఈ ఒప్పందం విలువ 375 మిలియన్ డాలర్లు. ఫిలిప్పిన్స్ రక్షణశాఖ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆదేశ రక్షణశాఖ వెబ్సైట్లో పేర్కొన్నది. త్వరలోనే ఇండియా బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పిన్స్‌కు ఎగుమతికానున్నాయి. క్షిపణులతో […]
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
-
IRDAI New Insurance Rules: హెల్త్, మోటార్ ఇన్సూరెన్స్‌పై IRDAI కొత్త ప్రతిపాదనలు.. పాలసీదారులకు ఏమి మారనుంది?
-
Mohanlal : మోహన్ లాల్- జీతూ జోసెఫ్ క్రేజీ ప్రాజెక్ట్ రీ – ఓపెన్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?