Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్ళీ ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో రెండు దేశాల దళాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్‌లోని గులిస్తాన్ సెక్టార్ గుండా ఆఫ్గాన్ తాలిబాన్ పోరాటయోధులు కొందరు పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన పాకిస్థాన్ భద్రతా బలగాలు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగాయి. ఈ కాల్పుల్లో పలువురు తాలిబాన్ పోరాటయోధులు హతమయ్యారని పాకిస్థాన్ వర్గాలు దావా చేస్తున్నాయి. అయితే తాలిబాన్ వైపు నుంచి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇరుపక్షాల మధ్య అప్పుడప్పుడు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ తాజా ఘర్షణ చోటుచేసుకుంది. సెప్టెంబర్ 23న కూడా సరిహద్దుల్లో కాల్పులు జరిగినట్లు వార్తలొచ్చాయి. తాలిబాన్లే సరిహద్దు పోస్టుల వద్ద ముందుగా కాల్పులు జరిపారని పాకిస్థాన్ ఆరోపించగా, కాబూల్ (అఫ్గానిస్థాన్ ప్రభుత్వం) ఆ ఆరోపణలను ఖండించింది. పరిస్థితి మరింత తీవ్రమవడంతో, సెప్టెంబర్ 24న ఆఫ్గానిస్థాన్‌లోని దాదాపు 10 స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) జరిపింది. ఆఫ్గానిస్థాన్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ దాడులకు నిరసనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ వెల్లడించారు. ఆఫ్గాన్ నుంచి వచ్చిన 8 డ్రోన్లను తమ బలగాలు కూల్చివేశాయని, ఆ తర్వాతే ఆ డ్రోన్లకు సంబంధమున్న స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేశామని పాక్ పేర్కొంది. ఈ దాడుల్లో పాకిస్థాన్ అమెరికాకు చెందిన GBU-12 లేజర్ గైడెడ్ బాంబును ఉపయోగించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతకుముందు, సెప్టెంబర్ 21న కూడా అఫ్గానిస్థాన్‌లోని కునార్, పక్తికా ప్రావిన్సులపై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల్లో 28 మంది ఉగ్రవాదులు మరణించారని పాక్ ప్రకటించగా, ఆఫ్గాన్ అధికారులు మాత్రం ఈ దాడుల్లో సామాన్య పౌరులు మరణించారని, కొందరు గాయపడ్డారని చెప్పారు.
Also Read
- Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
- Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
- Aamir Khan: రాజ్ ఠాక్రే ఇంటికి అమీర్ ఖాన్.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ కోసమేనా?
- AP Municipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం..
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!