మళ్లీ షాక్.. వంట గ్యాస్‌పై వడ్డింపు.. సబ్సిడీ కూడా కట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్న తరుణంలో మళ్లీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచేశారు. నెలల రోజుల వ్యవధిలోనే ప్రజలపై వందల రూపాయల భారాన్ని మోపారు. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇక, సిలిండర్ బుక్ చేసుకున్న వ్యక్తి ఈ మొత్తం చెల్లిస్తే సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడేది. కానీ, ప్రస్తుతం సబ్సిడీ నగదు కూడా జమ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధరలను 184 రూపాయలు చొప్పున పెంచింది. ప్రస్తుత ధరల పెంపు తరువాత హైదరాబాద్‌లో వినియోగదారులు సిలిండర్‌కు 771.50 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ ధర 746.50గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోలు సిలిండర్ ధర 664 నుంచి 719 రూపాయలకి పెరిగింది. కోల్‌కతాలో 745.50, ముంబైలో 719, చెన్నైలో 735 రూపాయలకి చేరింది.
రాయితీ సిలిండర్ లను కూడా త్వరలోనే ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. ఇది అమలైతే వినియోగదారులపై భారం పడనుంది. సిలిండర్ బుక్ చేసుకున్న తేదీతో సంబంధం లేకుండా డెలివరీ చేసిన రోజునే ప్రాతిపదికగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. రోజువారీగా వేల గ్యాస్ సిలిండర్ల వరకు వినియోగం ఉంటుంది. ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం పెరిగిన 25 రూపాయలు అదనపు భారం పడింది. ఈ లెక్కన రోజువారీ కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రజల పై మోపారు. ఇక, గ్యాస్ సిలిండర్ గతంలో సబ్సిడీ మినహాయించి వినియోగదారుల నుంచి ధర వసూలు చేసే వారు. అప్పట్లో 500లోపే సిలిండర్ ధర ఉండేది. తర్వాత ధర పెరిగినా పెంచిన మొత్తం ధర వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందకంటే గ్యాస్ సిలిండర్ అసలు ధరే 746 రూపాయలు ఉంది. ఈ నెలలో పెంచిన ధరల ప్రకారం 771 చెల్లిస్తే.. సబ్సిడీ మొత్తం తిరిగి వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమకావాలి. ఇప్పటి వరకు ఈ మొత్తం సొమ్ము జమ కావడం లేదు. అసలు సబ్సిడీ మినహాయించి గ్యాస్ సిలిండర్ ధర ఎంతో కూడా తెలియడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే అసలు గ్యాస్ సిలిండర్ ఏ విధంగా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరపై రాష్ట్రం విధించే వ్యాట్ తగ్గించుకుంటే ఇంతగా పెరిగే అవకాశం ఉండదంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని, ఈ సమయంలో గ్యాస్ ధరలు పెంచటం ఎంత వరకు సమంజసమని విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్‌లో కీలక మార్పులు
తాజావార్తలు
-
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
-
Mahaveer Karna: కర్ణుడిగా లారెన్స్ లుక్ అదిరింది.. కానీ దానవీర కర్ణుడిని ఇలా చూపిస్తారా?
-
India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!