బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఆహార ప్రణాళికలో కొత్త నియమాలు పెట్టిందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ వార్తల పై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఏ విధమైన నియమాలు పెట్టలేదని తెలిపారు. ఈ ఏడాది బీసీసీఐ కాంట్రాక్టు పొందిన ఆటగాళ్ల యొక్క ఆహార అలవాట్లు నిర్ణయించడంలో క్రికెట్ బోర్డు ఎటువంటి పాత్ర పోషించదు అని పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి న్యూజిలాండ్ […]
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 27 మంది 53 సెట్లు నామినేషన్లు దాఖలు చేసారు. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. టీఆర్ఎస్ తరపున ఎల్ రమణ, బాను ప్రసాద్ రావులు నామినేషన్ వేశారు. అయితే ఈ పోటీకి దూరంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నియోజకవర్గాల వారిగా […]
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో మూడోసారి.. ఈరోజు ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు కావాలంటూ ఎన్నికల అధికారి నుంచి కేశినేని నానికి సమాచారం అదింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా గొల్లపూడి, ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయి. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో […]
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత్రాత్మక సిరీస్ విజయానికి నాయకత్వం వహించాడు రహానే. కానీ ఈ మధ్య కొంత ఫామ్ కోల్పోవడంతో రహానే పై చాలా విమర్శలు వస్తున్నాయి. ఇక తాజాగా వాటిపైన భారత […]
నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనున్నారు. రేపటి నుంచి ఐదు రోజులు పాటు సంప్రోక్షన కార్యక్రమాన్ని వైధికంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఇక ఇదిలా ఉంటె భారీ వర్షాలతో తిరుమలలో వరదలు […]
బంగారానికి డిమాండ్ మన దేశంలో ఎప్పుడూ ఉంటుంది. అయితే మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 690 తగ్గి రూ. 45,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం […]
మల్లారెడ్డి యూనివర్శిటీ మరియు మోటివిటి ల్యాబ్స్ సహకారంతో టెక్నో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవస్థాపక చైర్మన్ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ఉన్నత విద్య తో పాటు ఉపాది అవకాశాలుతో పాటు విద్యార్థులు చదువుకొంటూనే ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక పరమైన ఆలోచనలు పరస్పరం పంచుకోవడం, ఇంటర్న్ పిప్ ల ద్వారా పరిశ్రమల వాతావరణం అనుకూలంగా ఉంటేట్లు ఏర్పాటు చేస్తూ వారికి శిక్షణ అందిస్తామని ,,ఇన్నోవేషన్ & స్టార్ట్ అప్ లను ప్రోత్సహిస్తూ వారి ఆలోచనలకు వాణిజ్యీకరణ […]
బిగ్ బాస్ సీజన్ 5 కథ కంచికి చేరే సమయం ఆసన్నం కావడంతో హౌస్ మేట్స్ మధ్య వాదోపవాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో కెప్టెన్ తప్ప అంతా నామినేషన్స్ కు గురవుతామనే విషయం తెలిసి కూడా, ఎవరి వాదనలు వారు వినిపించే క్రమంలో గట్టిగా అరుచుకుంటూ, వీక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. సోమవారం నామినేషన్స్ సమయంలో సన్నీ, శ్రీరామచంద్ర మధ్య వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మధ్యలో మానస్ వచ్చి వారిని […]
ఈ తరం క్రికెటర్లలో మెరుగైన ఆటగాడు ఎవరు అంటే చెప్పే మొదటి పేరు విరాట్ కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చిన సమయం నుండి కోహ్లీ వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ… కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. అయితే కోహ్లీ ఒక్కడే సచిన్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడు అని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్య కోహ్లీ అనుకున్న విధంగా పరుగులు చేయడం లేదు. ఎంతలా అంటే.. ఈ రోజుతో కోహ్లీ […]
ప్రముఖ నటుడు, రచయిత, సాహితీ వేత్త తనికెళ్ళ భరణికి లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ప్రకటించింది. జనవరి 18న ఎన్టీఆర్, హరివంశరాయ్ బచ్చన్ వర్థంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని అయనకు అందచేయనున్నారు. ఈ మేరకు లోక్ నాయక్ ఫౌండేషన్ ఛైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రకటించారు. సోమవారం ఆంధ్రాయూనివర్శిటీలో మీడియాకు తెలియచేశారాయన. ఇప్పటి వరకూ ఈ పురస్కారం కింద లక్షరూపాయల నగదుని బహుమతిగా అందచేసి సత్కరిస్తూ వచ్చారు. […]