డిసెంబర్ 4న జరగనున్న బీసీసీఐ ముఖ్యమైన ఎన్నికల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ప్రాతినిధ్యం వహించనున్నాడు భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. అయితే ఇన్ని రోజులుగా తప్పుడు కారణాలు.. అలాగే అంతర్గత గొడవల కారణంగా వార్తల్లో నిలిచినా మన హెచ్‌సీఏకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే సందేహం అందరికి కలిగింది. ఈ అంతర్గత గొడవలు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక సుప్రీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ […]
యూఏఈలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు తన ప్రయాణాన్ని పాకిస్థాన్ తో మొదలు పెట్టింది. అయితే ఈ మ్యాచ్ లో టీం ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక తాజాగా ఈ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో అభిమానులు వీక్షించారు అని ఐసీసీ ప్రకటించింది. మన జట్టు ఓడిపోయినా.. ఇండియాలోనే ఈ మ్యాచ్ ను అత్యధికంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు అభిమానులు చూసారు. ఇక ఇన్ని రోజులు ఈ అత్యధిక […]
ఏపీ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు నారా భువనేశ్వరి స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు. అందులో… ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, తోబుట్టువుకు, కూతురికి జరిగినట్టుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను అన్నారు. చిన్నతనం నుంచి అమ్మ, నాన్న మమ్మల్ని విలువలతో ఉంటారు. నేటికీ మేము […]
ఆస్ట్రేలియా జట్టు వచ్చే నెల 8 నుండి ఇంగ్లాండ్ జట్టుతో ఎంతో ముఖ్యమైన యాషెస్ సిరీస్ లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కు జట్టును కూడా ప్రకటించిన తర్వాత కొన్ని ఆరోపణల కారణంగా టిమ్ పైన్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. దాంతో జట్టు తర్వాతి కెప్టెన్ ఎవరు అనే దానిపైన చాలా చర్చలు జరిగాయి. మళ్ళీ స్టీవ్ స్మిత్ కే కెప్టెన్సీ భాధ్యతలు ఇస్తారు అని కూడా వార్తలు వచ్చాయి. […]
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశంలో 10,549 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 488 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,39,77,830 కోట్ల మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,67,468 మంది మృతి చెందారు. దేశంలో 1,10,133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, తప్పనిసరిగా ప్రతి […]
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్ లో నిన్న ఆట ముగిసే సమయానికి 75 పరుగులతో ఉన్న భారత ఆటగాడు శ్రేయర్ అయ్యర్ ఈరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేసాడు అయ్యర్. అయితే ఇదే అయ్యర్ కు మొదటి టెస్ట్ మ్యాచ్ అనే విషయం తెలిసిందే. ఇక ఇలా అరంగేట్ర […]
బలం ఉన్నచోట బరి.. బలం లేనిచోట ప్రత్యర్థిపై గురి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహం ఇదేనా? అన్నిచోట్లా కాకుండా.. కొన్నిచోట్లే పోటీ చేయడం వెనక నాయకుల మతలబు ఏంటి? అప్పనంగా అధికారపార్టీకి కట్టబెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏంటా పార్టీ? వారు వేస్తున్న లెక్కలేంటి? నల్లగొండలో నేతల మధ్య కుదరని సయోధ్య..! తెలంగాణ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఖమ్మంలో రాయల్ నాగేశ్వరరావు, మెదక్‌లో నిర్మలా జగ్గారెడ్డికి బీఫామ్ […]
లెక్కలు తారుమారు అవుతున్నాయా? ఎన్నిక ఎన్నికకూ ఈక్వేషన్స్ మారుతున్నాయా? రేస్‌లో ముందున్నవారు.. తాజా లెక్కలతో తారుమారు అవుతారా? ఓటు బ్యాంక్ కోసం.. అధిష్ఠానం అదే ఊపులో వెళ్తే అమాత్య పదవిపై ఆశలుపెట్టుకున్న వారికి నిరాశ తప్పదా? ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కీలకంగా మారిన సమీకరణాలు..! విశాఖజిల్లా అధికారపార్టీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. స్ధానిక సంస్ధల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు వైసీపీ నిర్ణయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సామాజిక న్యాయం ప్రధానాంశంగా ఇక్కడ పదవుల పంపకం చేస్తోంది […]
ఏపీ రాజధానిగా అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా చూడాలన్నది నాటి సీఎం చంద్రబాబు స్వప్నం. ప్రపంచ ప్రఖ్యాత నగరాలను పరిశీలించి రాజధాని నిర్మాణానికి ప్లాన్ చేశారు. అయితే నిర్మాణం పనులు మాత్రం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కానీ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి ప్రక్రియ మాత్రం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలను పెట్టుబడులకు ఆహ్వానించారు. వాటిలో కొన్ని ముందుకు వచ్చాయి. మరికొన్ని వచ్చే క్రమంలో ఉన్నాయి. ఈ లోగా రాజధాని భూ సేకరణలో అవకతవకల అంశం తెరమీదకు […]
ఆర్టీసీ గౌరవంగా ఇచ్చే జీతభత్యాలు వద్దన్నారు బాజిరెడ్డి గోవర్ధన్. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ సంస్థ నుండి ఎలాంటి జీతభత్యాలు తీసుకోనని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. శాసనసభ సభ్యునిగా తనకు వస్తున్న జీతభత్యాలు చాలునని, టీఎస్ ఆర్టీసీ ప్రస్తుతం తీవ్ర నష్టాల్లో ఉన్నందున ఆర్థిక భారం మోపడం ఇష్టం లేక తన వంతుగా ఈ నిర్ణయం తీసుకునట్లు తెలియజేసారు. అయితే చైర్మన్ బాజిరెడ్డి టీఎస్ […]